హోమ్ / వంటకాలు / ఊదల దధ్యోదనం

Photo of Barnyard millet curd rice by kalyani shastrula at BetterButter
827
6
0.0(0)
0

ఊదల దధ్యోదనం

Jan-31-2019
kalyani shastrula
360 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊదల దధ్యోదనం రెసిపీ గురించి

ఊదలు తో చేసే పెరుగు అన్నం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1కప్ ఊదలు
  2. 2కప్స్ పెరుగు
  3. రెండు పచ్చిమిర్చి
  4. చిన్న అల్లం ముక్క
  5. మిరియాలు కచ్చాపచ్చా చేసినవి పది
  6. శొంఠి పొడి స్పూన్
  7. కొత్తిమీర ,కరివేపాకు
  8. కాజు 2
  9. బాదాం 2
  10. ఆవునెయ్యి పోపుకు సరిపడా
  11. నీళ్లు నాలుగు కప్పులు

సూచనలు

  1. ముందుగా ఒక కప్ ఊదలు నాలుగు నుంచి ఆరు గంటలు నానబెట్టుకోవాలి
  2. నానబెట్టిన ఊదలును నాలుగు రెట్లు నీళ్ళ ఎసరులో పోసి ఉడకబెట్టి పెట్టుకోవాలి
  3. పెరుగు సిద్ధంగా ఉంచుకోవాలి .పుల్లగా ఉంటే కొన్ని పాలు పోసి పెట్టుకోవాలి
  4. మూకుడులో అవు నేయి వేసి స్పూన్ శెనగపప్పు ,మినపప్పు ,ఆవాలు ,జిలకర ,ఇంగువ ,తరిగిన పచ్చిమిర్చి ,కరివేపాకు తరిగిన అల్లం ,కచ్చపచ్చచేసిన మిరియాలు,కొత్తిమీర వేసి పెరుగులో కలపాలి
  5. ఇప్పుడు ఆ పెరుగులో సరిపడా ఉప్పు ,స్పూన్ శొంఠి పొడి వేసి కలిపి ఉడకబెట్టిన ఊదలు వేసి పెరుగు మొత్తం కలిసేట్టుగా కలిపి నేతిలో వేయించి చిన్న ముక్కలుగా చేసుకున్న కాజు ,బాదాం కూడా వేసి మరోసారి కలిపి పెట్టుకోవాలి
  6. చాలా ప్రోటీన్ ,ఫైబర్ కలిగిన ఎంతో ఆరోగ్యకరమైన,బలమైన ఆహారం సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర