హోమ్ / వంటకాలు / పాలక్ ,గోబీ (కాలీఫ్లవర్ )మంచురియా(without maida )

Photo of Palak gobi manchuria by kalyani shastrula at BetterButter
2472
7
0.0(0)
0

పాలక్ ,గోబీ (కాలీఫ్లవర్ )మంచురియా(without maida )

Jan-31-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ ,గోబీ (కాలీఫ్లవర్ )మంచురియా(without maida ) రెసిపీ గురించి

Fry item

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తెలంగాణ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. రెండు పెద్ద పాలకూర కట్టలు
  2. చిన్న సైజు ఉడికించి పెట్టుకున్న గోబీ (కాలిఫ్లవర్ )
  3. నాలుగు పచ్చిమిర్చి
  4. చిటికెడు పసుపు
  5. చిటికెడు ఇంగువ
  6. రెండు కట్టలు కొత్తిమీర
  7. ఒక రెమ్మ కరివేపాకు
  8. సరిపడా ఉప్పు
  9. రెండు క్యారెట్ ల తురుము
  10. చిన్న కప్ పచ్చి బఠాణి
  11. చిన్న అల్లం తురుము
  12. స్పూన్ జిలకర
  13. రాగుల పొడి చిన్న కప్
  14. కార్న్ ఫ్లోర్ చిన్న కప్
  15. నానబెట్టు ఉడికించి పెట్టుకున్న రాజ్మా పది గింజలు
  16. నిమ్మ చెక్క
  17. నూనె గోలించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా గోబీ ని ఉడికించి తరిగి పెట్టుకోవాలి .క్యారెట్ తురిమి పెట్టుకోవాలి .అల్లం తురిమి పెట్టుకోవాలి .కొత్తిమీర ,కరివేపాకు,పాలకూర ,పచ్చిమిర్చి అన్నీ చిన్నగా తరిగి పెట్టుకోవాలి .పచ్చి బఠాణి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి .(ఉల్లి వెల్లిపాయ కూడ వేసుకోవచ్చు).
  2. వీటిలో తగినంత ఉప్పు స్పూన్ జిలకర ,చిటికెడు ఇంగువ ,చిటికెడు పసుపు ,వేసి కలిపి పెట్టుకోవాలి .అందులో పట్టేఅంతగా రాగులపొడి ,కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి .నీళ్లు పోయకూడదు .(మైదా హెల్త్ కు మంచిది కాదు అందుకే రాగుల పిండి వాడాను)
  3. ముద్ద వలె వచ్చేట్టుగా కలపాలి
  4. ఇప్పుడు కొద్దిగా ముద్దను తీసుకొని ఉండలుగా చేయాలి
  5. ఇప్పుడు వీటిని కాగుతున్న నూనెలో చిన్న మంటలో గోలించుకోవాలి .
  6. ఏవిధంగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి .పైన నిమ్మరసం పిండి కొత్తిమీర తరుగు ,చిన్నగా తరిగిన రాజ్మా చల్లుకోవాలి . తినేవాళ్ళు ఉల్లి వెల్లిపాయ తరుగు వేసుకొని పైన సాస్ వేసుకొని తినవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర