హోమ్ / వంటకాలు / చిక్ పీస్ పన్నీర్ టిక్కా

Photo of Chickpeas paneer tikka by sravanthi komaravelli at BetterButter
773
4
0.0(0)
0

చిక్ పీస్ పన్నీర్ టిక్కా

Feb-01-2019
sravanthi komaravelli
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్ పీస్ పన్నీర్ టిక్కా రెసిపీ గురించి

ఇందులో శనగలు, పన్నీర్ ఉన్నాయి కనుక మంచి ప్రోటీన్ లభిస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పన్నీర్ 100 గ్రాములు
  2. శనగలు 200 గ్రాములు
  3. ఉడకపెట్టిన బంగాళాదుంపలు మూడు
  4. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి
  5. సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు
  6. కొత్తిమీర ఒక కట్ట
  7. పుదీనా ఒక కట్ట
  8. ఉప్పు తగినంత
  9. కారం ఒక స్పూను
  10. చన్న మసాలా రెండు స్పూన్లు
  11. నిమ్మరసం మూడు స్పూన్లు
  12. నూనె ఆరు స్పూన్లు
  13. బ్రెడ్ క్రంబ్స్

సూచనలు

  1. శనగలు ఆరు గంటలు నానబెట్టాలి.
  2. నానబెట్టిన శనగలలో కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ లో 5 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి.
  3. శనగలు వార్చి చల్లారిన తరువాత గ్రైండ్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు పన్నీర్ తురుము, ఉడికించిన బంగాళదుంప తురుము , ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, చన్న మాసాల, కొత్తిమీర తురుము, పుదీనా తురుము, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
  5. కలిపిన మిశ్రమాన్ని టిక్కీ లాగా చేసుకోవాలి.
  6. టిక్కీలను బ్రెడ్ క్రంబ్స్ లొ రోల్ చేయాలి.
  7. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి వేడి అయ్యాక నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.
  8. టొమాటో కెచప్ తో తింటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర