హోమ్ / వంటకాలు / ఉలవలుతాటిబెల్లం భక్షాలు (బొబ్బట్లు)

Photo of Horse gram puran poli  by kalyani shastrula at BetterButter
830
7
0.0(0)
0

ఉలవలుతాటిబెల్లం భక్షాలు (బొబ్బట్లు)

Feb-02-2019
kalyani shastrula
480 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉలవలుతాటిబెల్లం భక్షాలు (బొబ్బట్లు) రెసిపీ గురించి

ఉలవలు ,తాటిబెల్లం తో చేసే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్పు 8గంటలు నానిన ఉలవలు
  2. కప్పు తాటిబెల్లం
  3. స్పూన్ ఇలాయిచి పొడి
  4. గోధుమపిండి కప్
  5. రవ్వపావుకప్పు
  6. అవు నెయ్యి

సూచనలు

  1. ముందుగా ఎనిమిది గంటలు ఉలవలు నానబెట్టుకొని ఉంచుకోవాలి
  2. గోధుమ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ ,చిటికెడు ఉప్పు వేసి పూరి పిండివలె కలుపుకోవాలి .దీనిని అరగంట పాటు నానబెట్టుకోవాలి . సాధారణంగా maida వాడుతారు .అది హెల్త్ కు మంచిది కాదు అందుకే గోధుమపిండి వాడడం జరిగింది .
  3. నానిన ఉలవలు కుక్కర్లో పెట్టి అయిదు విసిల్స్ వచ్చేవరకు ఉంచి తీసి నీళ్లను వడకట్టుకోవాలి .నీళ్లు చారులో వాడుకోవచ్చు .
  4. నీళ్లు పూర్తిగా వడకట్టబడ్డాక ఉలవలను మిక్సీ చేసి పెట్టుకోవాలి
  5. ఇప్పుడు తాటిబెల్లం తీసుకొని ముక్కలుగా చేయాలి
  6. తాటిబెల్లం లేకుంటే మాములు బెల్లం /చెక్కర వాడుకోవచ్చు .
  7. బెల్లం కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని ఉలవల పొడిలో వేసి కలపాలి .ఇలాయిచి పొడి కూడా వేసి కలపాలి .
  8. తయారయిన ఉలవల పూర్ణం ను నిమ్మకాయ సైజు లో ఉండలుగా చేసుకోవాలి
  9. నానబెట్టి ఉంచిన గోధుమ పిండి ముద్దను కూడా ఉండలుగా చేసుకోవాలి
  10. ఒక గోధుమపిండి ముద్దను తీసుకొని చిన్న పూరి వలె చేతితో ఒత్తి అందులో ఉలవలపూర్ణం ముద్దను పెట్టాలి
  11. ఉలవలపూర్ణం ముద్ద చుట్టూ పిండి ముద్దను చుట్టాలి
  12. ఇలాగే అన్నీ తయారు చేసిపెట్టుకోవాలి
  13. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కు నూనె రాసి ఒక పూర్ణం పెట్టిన ముద్దను దానిపై ఉంచాలి .
  14. వేరే కవర్ పైనుంచి పెట్టాలి
  15. ఇప్పుడు చేతితో కాని చపాతీ కర్ర తో గాని ఒత్తుకోవాలి
  16. ఈ విధంగా వస్తుంది
  17. దీనిని తీసి వేడి పెనం మీద వేసి అవు నేతి తో కాల్చుకోవాలి
  18. అలాగే రెండో వైపు కూడా కాల్చుకోవాలి
  19. అన్నీ ఈ విధంగానే చేసుకుని పెట్టుకోవాలి .పైనుండి అవు నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచికరమైన ప్రోటీన్ కలిగిన ఆరోగ్యకరమైన ఉలవల బొబ్బట్లు సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర