హోమ్ / వంటకాలు / ఊదలు తో ఇడ్లీ ,పల్లీకొబ్బరి పచ్చడి .

Photo of Barnyard millet idly ,with coconut Peanut chutney by kalyani shastrula at BetterButter
699
4
0.0(0)
0

ఊదలు తో ఇడ్లీ ,పల్లీకొబ్బరి పచ్చడి .

Feb-06-2019
kalyani shastrula
840 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊదలు తో ఇడ్లీ ,పల్లీకొబ్బరి పచ్చడి . రెసిపీ గురించి

ఇడ్లీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. రెండు కప్పులు ఉదలు
  2. ఒక కప్ మినపగుండ్లు
  3. స్పూన్ మెంతులు
  4. సరిపడా ఉప్పు
  5. ఆవునెయ్యి కొద్దిగా
  6. పచ్చడి కొరకు
  7. కప్పు తురిమిన పచ్చి కొబ్బరి
  8. సగం కప్ పల్లీలు
  9. అయిదు పచ్చిమిర్చి
  10. కొత్తిమీర
  11. కరివేపాకు
  12. పోపుగింజలు
  13. నూనె
  14. ఉప్పు
  15. ఆవాలు
  16. జిలకర
  17. పసుపు
  18. ఇంగువ

సూచనలు

  1. మొదలు ఊదలు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి
  2. మినపగుండ్లు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి .అందులోనే స్పూన్ మెంతులు వేసి పెట్టుకోవాలి
  3. రాత్రి నానబెట్టుకుంటే తెల్లవారి ఉదయం రుబ్బుకోవాలి . మొదలు వెట్ గ్రైండర్ లో మినపగుండ్లు వేసి బాగా రుబ్బుకున్నాక అందులోనే ఊదలు కూడా వేసి మెత్తగా రుబ్బుకున్నాక ఉప్పు కలిపి పెట్టుకోవాలి .
  4. దీనిని అలాగే పక్కన పెట్టుకుంటే పొంగి ఉంటుంది .తెల్లవారి ఉదయం ఇడ్లీ ప్లేట్స్ కి కాస్త ఆవునెయ్యి రాసి ఇడ్లీ పిండి వేసి ఆవిరికి ఉడకనివ్వాలి
  5. పదిహేను నిముషాలు ఉడికాక రెండు నిముషాలు ఉండి తీయాలి
  6. కొద్దిగా టైం ఇచ్చి తీస్తే చక్కగా మెత్తటి ఇడ్లీ లు తయారయినట్టే
  7. పల్లి పచ్చడి కొరకు కప్ కొబ్బరితురుము కు వేయించి పెట్టుకున్న పల్లీలు ,పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .కొద్దిగా నీళ్లు /మజ్జిగా వేసి కొద్ది జారుగా పచ్చడిని మరోసారి మిక్సీ చేసి ,పోపులో పప్పులు ,ఎండుమిర్చి ,ఆవాలు, జిలకర, పసుపు ,ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి పచ్చడిలో కలుపుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర