హోమ్ / వంటకాలు / కొర్రలు పొంగణాలు

Photo of Foxtail millet ponganalu by Pasumarthi Poojitha at BetterButter
1490
7
0.0(0)
0

కొర్రలు పొంగణాలు

Feb-06-2019
Pasumarthi Poojitha
480 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్రలు పొంగణాలు రెసిపీ గురించి

టేస్టీ హెల్త్య్ పొంగణాలు అలాగే ప్రోటీన్ పవర్ కూడా ఉంటుంది కొర్రలు లో పిల్లలు కు ఇలా చేసి పెడితే చక్కగా తింటారు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కొర్రలు 1 కప్పు
  2. మినపగుళ్లు 1 కప్పు
  3. మెంతులు 1 టేబుల్ స్పూన్
  4. పచ్చన్న పప్పు 1 టేబుల్ స్పూన్
  5. ఉప్పు సరిపడా
  6. పసుపు చిటికెడు
  7. పచ్చి మిర్చి 1
  8. క్యారెట్ 1 తురుము
  9. నూనె కొద్దిగా
  10. జీలకర్ర 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా కొర్రలు,మినపగుళ్లు ,పచ్చన పప్పు,మెంతులు అన్ని ఒక గిన్నె లో వేసుకొని నీళ్లు పోసుకొని 8 గంటలు పాటు ననపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా వంచేసి మిక్సీ గిన్నె వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పిండి రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు ఆ పిండి ని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలి,పిండి పులుస్తుంది.
  4. ఆ పిండి లో ఉప్పు ,పసుపు,క్యారెట్ తురుము,పచ్చి మిర్చి ,జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి.
  5. ఇప్పుడు పోయి వెలిగించి గుంట పొంగణాలు పెనం పెట్టుకొని నూనె వేసుకొని పిండి ని కొంచం కొంచం వేసుకోవాలి.
  6. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి ,మూత తీసి తిప్పి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి.
  7. ఇప్పుడు వేడి వేడి పొంగణాలు రెడీ ,పల్లి చట్నీ తో తింటే వేడి వేడి గా చాలా బాగుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర