హోమ్ / వంటకాలు / సాంబార్ (ఎర్ర కందిపప్పు ,పెసరపప్పు ,కందిపప్పు)

Photo of Masoor dal Sambar by kalyani shastrula at BetterButter
997
7
0.0(0)
0

సాంబార్ (ఎర్ర కందిపప్పు ,పెసరపప్పు ,కందిపప్పు)

Feb-08-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాంబార్ (ఎర్ర కందిపప్పు ,పెసరపప్పు ,కందిపప్పు) రెసిపీ గురించి

సాంబార్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1cup ఎర్ర కందిపప్పు
  2. 1cup మాములు పప్పు
  3. 1/2cup పెసరపప్పు
  4. Cup పలచటి చింతపండు రసం
  5. ఒకటి క్యారట్
  6. రెండు టమాటాలు
  7. ఒక ముల్లంగి
  8. చిన్న దోసకాయ
  9. రెండు ములక్కాడలు
  10. ఉంటే మంచి గుమ్మడి ముక్కలు రెండు
  11. స్పూన్ మిర్యాల పొడి
  12. 1/2స్పూన్ శొంఠి పొడి
  13. 2స్పూన్స్ నువ్వులపొడి
  14. 1స్పూన్ ధనియా పొడి
  15. 1/2స్పూన్ మెంతులపొడి
  16. కరివేపాకు ,
  17. కొత్తిమీర
  18. పోపుకు నూనె
  19. ఉప్పు
  20. కారం
  21. చిన్న బెల్లం ముక్క

సూచనలు

  1. ముందు మూడు పప్పులు బాగా కడిగి నీళ్లు పోసి పెట్టుకోవాలి
  2. కంది ,ఎర్ర కంది పప్పు ,పెసరపప్పు
  3. ఈ పప్పులన్నీ కలిపి కుక్కర్లో పెట్టి ఉడికించి పెట్టుకోవాలి .ఇప్పుడు మూకుడులో నూనె వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,పసుపు ,ఇంగువ ,పచ్చిమిర్చి ,ఎండుమిర్చి ,కరివేపాకు వేసుకొని పోపు చేయాలి
  4. ఇప్పుడుతరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి
  5. కూరలు ఉడికాక ,ఉడికించిన పప్పు కూడా వేసి బాగా కలిపి చింతపండు రసం కూడా పోసి కలిపి ఉడికించాలి .
  6. చింతపండు రసం
  7. పొడులు
  8. ఇప్పుడు ఉప్పు ,కారం ,ధనియా ,నువ్వుల పొడి ,మెంతులపొడి ,మిరియాలు ,శొంఠి పొడి కూడా వేసి బాగా మరగనివ్వాలి
  9. కమ్మటి వాసనతో సాంబార్ బాగా మరిగాక తినేవాళ్లు కొద్ది బెల్లం వేసి కాసేపు ఉంచి కొత్తిమీర చల్లి తీసుకోవాలి .(పచ్చి కొబ్బరి తురుము ఉల్లిపాయ కూడా ఇష్టాన్నిబట్టి వేసుకోవచ్చు .)
  10. కుక్కర్లో ముక్కలు పప్పులు కూడా వేసి ఒకేసారి కూడా ఉడికించుకొని పొడులు వేసి పోపు పెట్టుకోవచ్చు . మాకైతే కొద్దిగా చిక్కగానే ఉండాలి సాంబార్ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర