హోమ్ / వంటకాలు / చోలే మసాలా, పూరి

Photo of Chole masaala, puri by Vandana Paturi at BetterButter
52
3
0.0(0)
0

చోలే మసాలా, పూరి

Feb-08-2019
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చోలే మసాలా, పూరి రెసిపీ గురించి

మంచి ప్రోటీన్ కలిగివున్న ఈ వంటకాన్ని చేసుకోవడము కూడా సులభం

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • టిఫిన్ వంటకములు
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. చోలే ఒక కప్పు
 2. ఉల్లిపాయలు 2
 3. టమోటా 2
 4. అల్లంవెళుల్లి పేస్ట్ 1 స్పాన్
 5. కొత్తిమీర కొంచం
 6. కొబ్బరి తురుము 2 స్పాన్స్
 7. చోలే మసాలా ఆఫ్ స్పాన్
 8. కారం 1 స్పాన్
 9. పసుపు చిటికీడు
 10. ఉప్పు తగినంత
 11. నూనె 2 స్పూన్స్
 12. జీలకర్ర ఆవాలు ఆఫ్ స్పాన్
 13. పురికోసం గోధుమపిండి 1 కప్పు
 14. ఉప్పు తగినంత
 15. నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా

సూచనలు

 1. ముందుగా చోలే చనా 2 గంటలు నానాబెట్టాలి ,
 2. నానినతరువత నీళ్లు వంచేసి కుక్కర్ లో కాస్త ఉప్పు నీళ్లు పోసి చోలే ఉడికించాలి ,
 3. 2 విజుల్స్ పెట్టుకోవాలి ,
 4. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ పోసి వేడి కాగానే జిరా ఆవాలు వేయాలి,
 5. అవి చిటపటలాడుతున్నపుడు ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపి 5 నిమిషాలు మూతపెట్టాలి ,
 6. టమోటా మెత్తగా అయ్యాక ,
 7. కొబ్బరితురుము అల్లంవెల్లుల్లి కొత్తిమీర వేసి కలిపి మరో 3 నిమిషాలు ముతపెట్టాలి ,
 8. అంత గుజ్జుగా అయ్యి ఆయిల్ అంచుల చివర్లో ఉంటుంది అప్పుడు ఉడికించుకున్న చోలే వెసి కలపాలి ,
 9. కారం చోలేమసాల వేసి కొన్ని నీళ్లు పోసి 2నిమిషాలు ఉడికించాలి ,
 10. చివరిలో ఇంకొంచం కొత్తిమీర చల్లి దించడమే .
 11. పురికోసం గోధుమపిండి ఉప్పు 1 స్పూన్ నూనె వేసి కలపాలి ,
 12. చపాతీ పిండికన్న కొంచం గట్టిగా తడుపుకోవాలి ,
 13. 5 నిమిషాలు తరువాత చిన్న చిన్న పూరీలు వత్తుకొని పెట్టుకోవాలి,
 14. స్టవ్ పై పాన్ పెట్టి డీఫ్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి వేడిచేసి పూరీలు కాల్చుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర