హోమ్ / వంటకాలు / గుమ్మడికాయ పులుసు( ఉడిపి స్టైల్)

Photo of PUMPKIN Sambar by Rashmi SudhiMurthy at BetterButter
754
4
0.0(0)
0

గుమ్మడికాయ పులుసు( ఉడిపి స్టైల్)

Feb-10-2019
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుమ్మడికాయ పులుసు( ఉడిపి స్టైల్) రెసిపీ గురించి

ఇది దక్షిణ కర్ణాటక లో ఎక్కువగా చేస్తారు.వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గుమ్మడికాయ 1 చిన్నది (ఆరంజ్ కలర్ది)
  2. కంది పప్పు 1 కప్
  3. పసుపు 1/4 టీ స్పూన్
  4. పచ్చికొబ్బరి తురుము 1/4 కప్
  5. ఎండు మిరపకాయలు 8(బ్యాడిగి)
  6. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు
  7. మెంతెలు 1/4 టీ స్పూన్
  8. జీలకర్ర 1/4 టీ స్పూన్
  9. చింతపండు రసం 3 టేబుల్ స్పూన్లు
  10. బెల్లం చిన్న ముక్క
  11. ఉప్పు రుచికి సరిపడా
  12. కరివేపాకు 2 రెమ్మలు
  13. కొత్తిమీర తరుగు 1 టేబుల్ స్పూన్
  14. నీళ్లు సరిపడా
  15. నూనె 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా కందిపప్పు కుక్కర్ లో వేసి అందులో తగినంత నీళ్ళు, పసుపు వేసిబిమెత్తగా ఉడకపెట్టాలి
  2. గుమ్మడికాయను ముక్కలుగా కోసి ఉప్పు,చింతపండురసం,బెల్లం,తగినంత నీళ్ళు వేసి ఉడికించాలి
  3. ఈలోగా ఒక పాన్ లో నూనె వేడి చేసి ఎండు మిరపకాయలు, ధనియాలు, మెంతెలు, జీలకర్ర దోరగా వేయించి,పచ్చికొబ్బరి తురుము వేసి కలిపి చల్లారనివ్వాలి
  4. చల్లారిన తరువాత మిక్సీలో వేసి, నీళ్ళు పోసి బరకగా రుబ్బుకుంటే పులుసుకి మసాల రెడీ
  5. ఇప్పుడు ఉడికిన గుమ్మడికాయ ముక్కల్లో, ఉడికిన పప్పు, రుబ్బిన పులుసు మసాలా,తగినంత నీళ్ళు వేసి మరిగించాలి
  6. ఉప్పు,పులుపు సరిచూసి కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి
  7. వేడి వేడి అన్నం,నెయ్యి, గుమ్మడికాయ పులుసు వేసి అప్పడం తో వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర