హోమ్ / వంటకాలు / గోధుమపిండి బెల్లం తో గుడ్డు ,ఒవేన్ లేకుండా చేసిన కేక్

Photo of cake (Without egg ,maida ,oven ) by kalyani shastrula at BetterButter
639
4
0.0(0)
0

గోధుమపిండి బెల్లం తో గుడ్డు ,ఒవేన్ లేకుండా చేసిన కేక్

Feb-10-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి బెల్లం తో గుడ్డు ,ఒవేన్ లేకుండా చేసిన కేక్ రెసిపీ గురించి

ఆవిరికి వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • ఆవిరికి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కప్ గోధుమ పిండి
  2. కప్ బెల్లం
  3. కప్ గడ్డపెరుగు
  4. కప్ చిన్న ముక్కలుగా చేసిన కాజు బాదాం,వాల్నట్స్
  5. నూనె పావు కప్పు
  6. చిటికెడు ఉప్పు
  7. బేకింగ్ పౌడర్ స్పూన్
  8. వెనిల్లా ఎసెన్స్
  9. ఇసుక సరిపడా

సూచనలు

  1. ముందుగా పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి
  2. ఇసుక
  3. కేకు తయారు చేసుకునే గిన్నెకు నూనె రాసి పొడి పిండి చల్లి పెట్టుకోవాలి .నేను చిన్న కుక్కర్ గిన్నె వాడాను .
  4. కుక్కర్లో ఇసుక పోసి మధ్యలో ఏదైనా స్టాండ్ పెట్టుకోవాలి మూత పెట్టి సిమ్ మీద ఉంచాలి .విసిల్ పెట్టకూడదు ..
  5. ఒక గిన్నెలో బెల్లం ,నూనె ,గడ్డపెరుగు వేసుకోవాలి
  6. బ్లెండర్ తో బాగా గిలకొట్టాలి
  7. అయిదు నిముషాలు చేయాలి
  8. ఇప్పుడు ఈ గిన్నె మీద జల్లెడ పెట్టి గోధుమపిండి చిటికెడు ఉప్పు ,బేకింగ్ పౌడర్ స్పూన్ వేసి జల్లించుకోవాలి .ఇలా చేయడం వల్ల ఉండలు కట్టదు .
  9. ఇప్పుడు వెనిల్లా ఎసెన్స్ వేసి బ్లెండర్ తో కొద్దిగా చిక్కగా అయ్యేవారకు గిలకొట్టాలి .పైన డ్రై ఫ్రూప్ట్స్ వేసి కలపాలి
  10. వెంటనే పొడిచల్లి పెట్టుకున్న గిన్నెలోకి దీనిని మొత్తం చేర్చి పైన మరికొన్ని డ్రై ఫ్రూప్ట్స్ వేసి పెట్టుకోవాలి
  11. దేనిని కుక్కర్ మూత తీసి లోపల ఉన్న స్టాండ్ లేదా గిన్నె పైన పట్టుకార్ సాయం తో పెట్టాలి .ఎందుకంటే కుక్కర్ బాగా వేడిగా ఉంటుంది .
  12. మూత పెట్టి విసిల్ పెట్టకుండా చిన్న మంట తో దాదాపు అరగంట ఉంచాలి .మూత తీసి ఫోర్క్ తో గుచ్చితే పిండి అంటకూడదు .
  13. పిండి అంటకుండా ఉంటే కేక్ అయినట్టు .అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి
  14. చల్లారాక గిన్నెమీద ప్లేట్ పెట్టి బోర్లించుకునే కేక్ చక్కగా ప్లేట్ లోకి దిగుతుంది
  15. ఇప్పుడు దీనిని తిప్పి పెట్టుకుంటే కేక్ సిద్దమయినట్టే .కమ్మగా గుల్లగా వచ్చిన బెల్లంతో చేసిన కేక్ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర