హోమ్ / వంటకాలు / సేమియా అరటి రోల్స్

Photo of Banana roasted roll by kalyani shastrula at BetterButter
411
3
0.0(0)
0

సేమియా అరటి రోల్స్

Feb-12-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా అరటి రోల్స్ రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 3కప్స్ వేయించిన సేమ్యా
  2. 2కప్స్ వాటర్
  3. 1కప్ పాలు
  4. 1కప్ పచ్చికొబ్బరి తురుము
  5. 1కప్ చెక్కరపొడి
  6. కాజు ,బాదాం పొడి రెండు స్పూన్స్
  7. 2 అరటి పండ్లు
  8. నెయ్యి సరిపడా 6tspn
  9. ఇలాయిచి పొడి

సూచనలు

  1. ముందుగా అరటిపండు ను ముక్కలుగా తరిగి నేతిలో కాస్త వేయించి పెట్టుకోవాలి .
  2. సేమ్యా వేయించి కచ్చా పచ్చగా మిక్సీ చేసి పెటుకోవాలి
  3. చెక్కర కూడా మిక్సీ చేసి పెట్టుకోవాలి
  4. ఇప్పుడు అదే మూకుడులోకొంచెం నెయ్యి వేసి (వేయించిన సేమ్యా నుకచ్చా పచ్చగా మిక్సీ చేసి పెట్టుకోవాలి )సేమ్యా ను వేయించాలి .
  5. ఇప్పుడు నీళ్లు పోసి ఉడికించుకోవాలి
  6. కొద్దిగా వేగగానే చెక్కర పొడి వేసుకోవాలి
  7. చెక్కర కరిగి కొద్దిగా వేగగానే నెయ్యి ,వేసి కలిపి కొద్దికొద్దిగా పాలు పోస్తూ కలుపుకోవాలి
  8. ఇప్పుడు ఇలాయిచి పోసి ,బాదాం పొడి వేసి అవసరమైతే కొద్దిగా నెయ్యి కూడా వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి
  9. సేమ్యా మూకుడుకు అంటుకోకుండా ఉండాలి అప్పుడు తీసి ఒక ప్లాస్టిక్ కవర్ కు నెయ్యి రాసి దానిమీద వేయాలి .
  10. ఇప్పుడు కవర్ సాయంతో బాగా కలుపుతూ ముద్దగా చేసుకోవాలి .డైరెక్ట్ చేయి పెడితే కాలుతుంది .
  11. ఈ విధంగా ముద్దగా వచ్చేట్టు కలుపుకోవాలి
  12. కవర్ కు నెయ్యి కాస్త రాసి ఈ ముద్దను చాప వలె ఒత్తుకోవాలి
  13. ఇప్పుడు వేయించి పెట్టుకున్న అరటి ముక్కలు వేసి చక్కగా పరచుకోవాలి
  14. ఇప్పుడు కవర్ ను ఫోల్డ్ చేస్తూ నెమ్మెదిగా చుట్టుకోవాలి .అవసరమైతే నెయ్యి అద్దుతూ ఉండాలి
  15. ఈ విధంగా మళ్లీ ఫోల్డ్ చేసుకోవాలి
  16. నెక్స్ట్ స్టెప్
  17. నెక్స్ట్ స్టెప్
  18. అ తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి
  19. ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసాక కవర్ కూడా చుట్టుకొని ,ఇంకో కవర్ మీద పెట్టి చుట్టుకోవాలి
  20. వేరే కవర్ లో ఇలా పెట్టి చుట్టుకోవాలి
  21. ఏవిధంగా చుట్టిన దానిని 6గంటలు ఫ్రిజ్ లో పెట్టి తీయాలి
  22. ఫ్రిజ్ నుండి తీసాక చాకు తో ముక్కలుగా చేసుకోవాలి
  23. అన్ని ఈ విధంగా చేసాక సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర