హోమ్ / వంటకాలు / రాగులు జొన్నలు తో జావ

Photo of Finger millet ,jowar java by kalyani shastrula at BetterButter
2867
4
0.0(0)
0

రాగులు జొన్నలు తో జావ

Feb-12-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగులు జొన్నలు తో జావ రెసిపీ గురించి

జావ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • వేడి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. ఒక కప్ రాగుల పిండి
  2. ఒక కప్ జొన్నలు
  3. 8కప్స్ నీళ్లు
  4. ఉప్పు
  5. నల్ల ఉప్పు
  6. జల్జీరా పొడి లేదా జిలకర పొడి
  7. కొత్తిమీర కట్ట
  8. పుదీనా కట్ట
  9. పలచటి చల్ల (మజ్జిగ) 6 కప్స్
  10. క్యారెట్ తురుము
  11. వేసుకుంటే ఉల్లి ముక్కలు

సూచనలు

  1. జొన్నలు ముందు రోజే నానబెట్టుకొని రుబ్బుకోవాలి
  2. రాగుల పిండిలో నీళ్లు పోసి ఉంచుకోవాలి . (రాగులు మొలకలు వచ్చాక ఆరబెట్టి పిండి పట్టించు కుంటే B విటమిన్ బాగా వస్తుంది )
  3. ఒక పెద్ద గిన్నెలో నాలుగు గ్లాస్ ల నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి .మరుగుతున్నప్పుడు జొన్న ముద్ద వేయాలి
  4. ఇది ఉడికాక రాగుల పొడిలో రెండు గ్లాస్ ల నీళ్లు పోసి పలచగా చేసుకొని ఉడుకుతున్న నీళ్లలో కలుపుతూ పోయాలి
  5. చిన్న మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి
  6. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి
  7. చిక్కగా అయ్యేవరకు ఉడికించుకోవాలి
  8. ఇప్పుడు ఇంకాస్త ఉప్పు ,నల్ల ఉప్పు ,జలజీర పొడి లేదా జీలకర్రపొడి ,క్యారెట్ తురుము ,తినేవాళ్లు ఉల్లిపాయ ముక్కలు ,కొత్తిమీర ,పుదీన ఆకులు వేసుకొని పెరుగు వేసుకొని అలాగే కలుపుతూ వేడివేడిగా తాగవచ్చు .
  9. లేదా దానిని చల్లారాక ఫ్రిజ్ లో పెట్టి అవసరం అయినప్పుడు గ్లాస్ లో కొద్దిగా వేసి క్యారెట్ కొత్తిమీర ,పుదీన ఆకులు ,కొద్దిగా ఉప్పు ,నల్ల ఉప్పు జలజీర పొడి వేసుకోవాలి
  10. పలచటి మజ్జిగ గ్లాస్ నిండా పోసి కలుపుకోవాలి
  11. చాలా ప్రోటీన్ కలిగి ,ఎంతో ఆరోగ్యకరమైన జావ సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర