హోమ్ / వంటకాలు / బాదాం కుకీస్

Photo of Almond cookies by Rashmi SudhiMurthy at BetterButter
508
3
0.0(0)
1

బాదాం కుకీస్

Feb-12-2019
Rashmi SudhiMurthy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదాం కుకీస్ రెసిపీ గురించి

ఇవి సాయంకాలం స్నాక్స్ లాగా బాగుంటుంది. బాదంపప్పు, గోధుమ పిండితో చేయటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఇతర
  • బేకింగ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 3/4 కప్
  2. బాదాం పప్పు పుడి (బరకగా)1/2 కప్
  3. బాదాం పప్పు 10 నుంచి 15
  4. పంచదార 1/2 కప్
  5. వెన్న 2 టేబుల్ స్పూన్లు ( ఉప్పు లేనిది)
  6. ఎలక్కుల పుడి 1/2 టీ స్పూన్
  7. బేకింగ్ పౌడర్ 1/4 టీ స్పూన్
  8. ఉప్పు చిటికెడు
  9. పాలు 4 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. బాదం పప్పు ను బరకగా గ్రైండ్ చేయాలి
  2. గోధుమ పిండిని జల్లడి పట్టి అందులో కి చిటికెడు ఉప్పు, బేకింగ్ పౌడర్ , బాదాం పప్పు పుడి వేసి కలిపి పెట్టుకోవాలి
  3. ఒక బౌల్ లో వెన్న(రూమ్ టెంపరేచర్), పంచదార పుడి, ఏలకుల పుడి వేసి బాగా కలపాలి.
  4. ఇప్పుడు ఇందులో గోధుమపిండి మిశ్రమాన్ని కొంచెం పాలు వేసి పూరి పిండి లా కలపాలి
  5. మైక్రోవేవ్ 180 డిగ్రీస్ ప్రీహీట్ చేసిపెట్టుకోవాలి
  6. ఇప్పుడు ఒక ట్రే లో నూనె లేదా బట్టర్ పేపర్ వేసి పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి కొంచెం ఒత్తి దానిపైన ఒక బాదాం పప్పు పెట్టి కుకీస్ లా చేసుకోవాలి
  7. తయారు చేసుకున్న కుకీస్ ను 180 డిగ్రీస్ లో 15 నుంచి 18 నిమిషాల లోపు బేక్ చేయాలి.మధ్యలో ఒక సారి పాలతో బ్రష్ చేయాలి
  8. ఎంతో క్రిస్పీ మరియు రుచికరమైన కుకీస్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర