Moong dal dhokla | Moong dal dhokla Recipe in Telugu

ద్వారా kalyani shastrula  |  15th Feb 2019  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Moong dal dhokla by kalyani shastrula at BetterButter
Moong dal dhoklaby kalyani shastrula
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

1

Moong dal dhokla

Moong dal dhokla తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong dal dhokla Recipe in Telugu )

  • 1 కప్ పెసరపిండి లేదా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు
  • 1 కప్ పెరుగు
  • 1/4కప్ సెనగపిండి
  • 2స్పూన్స్ సోడా
  • స్పూన్ ఉప్పు
  • స్పూన్ చెక్కర
  • స్పూన్ పసుపు
  • స్పూన్ ఇంగువ
  • 1 స్పూన్ నూనె
  • 1 స్పూన్ నెయ్యి
  • కొత్తిమీర తరుగు
  • రెండు పచ్చిమిర్చి (చిన్నగా తరుక్కోవాలి)
  • ఆవాలు ,జిలకర కలిపి స్పూన్

Moong dal dhokla | How to make Moong dal dhokla Recipe in Telugu

  1. కప్ పెసర పిండి తీసుకోవాలి .లేదా పెసరపప్పు మెత్తగా ఉడికించి మిక్సీ చేసి పెట్టుకోవాలి .నేను పెసరపప్పు మర పట్టించిన పిండి ని తీసుకున్నాను . కప్ పెసర పిండి
  2. కప్ పెరుగు
  3. పావు కప్పు సెనగపండి
  4. పచ్చిమిర్చి తరిగి పెట్టికోవాలి
  5. ఉప్పు
  6. చెక్కర
  7. ఇంగువ
  8. అన్నీ ఒక బౌల్ లో వేసి కప్ నీరు పోసి బాగా కలపాలి .ఎక్కువ జారుగా ఉండకూడదు .
  9. ఇప్పుడు రెండు చుక్కల నూనె వేసి బాగా ఉండలు లేకుండా కలపాలి
  10. కాసేపు పక్కన పెట్టి ,కుక్కర్లో నీళ్లు పోసి వేడిచేయాలి
  11. ఇప్పుడు 2స్పూన్స్ సోడా వేసి బాగా కలిపి ఒక ప్లేట్ లేదా గిన్నెలో పోసి కుక్కర్లో పెట్టాలి
  12. ఇడ్లీ కుక్కర్ లో పెట్టిన ప్లేట్
  13. 20 నిముషాలు మూత పెట్టి ఆవిరికి ఉడికించాలి
  14. మూత తీసి ఒక ఫోర్క్ పెట్టి చూస్తే పిండి అంటకూడదు .
  15. ఇప్పుడు కుక్కర్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి
  16. మూకుడులో నెయ్యి వేసి ఆవాలు ఎండుమిర్చి ,జిలకర ,పచ్చిమిర్చి తరుగు ,కొత్తిమీర వేసి పోపు చేసుకోవాలి
  17. ఈ పోపును ఉడికించుకున్న మిశ్రమం మీద పోయాలి .మొత్తం పోపు పరచుకునేట్టుగా చూడాలి .
  18. పై నుండి పచ్చి కొబ్బరి తురుము చల్లుకోవాలి
  19. చల్లారాక ముక్కలుగా గాట్లు పెట్టుకోవాలి
  20. ఒక్కొక్క ముక్కను జాగ్రత్తగా తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి .
  21. ఎంతో మెత్తగా దూదివలె ఉండే రుచికరమైన ఢోక్లా రెడీ

Reviews for Moong dal dhokla Recipe in Telugu (1)

మొహనకుమారి jinkalaa year ago

Yummy dish mdm
జవాబు వ్రాయండి