హోమ్ / వంటకాలు / ముల్లంగి ఆకు పెసరపిండి పరోటా

Photo of Radish leaf moong flour parota by kalyani shastrula at BetterButter
463
1
0.0(0)
0

ముల్లంగి ఆకు పెసరపిండి పరోటా

Feb-17-2019
kalyani shastrula
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి ఆకు పెసరపిండి పరోటా రెసిపీ గురించి

ముల్లంగి ఆకులతో చేసే వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ తరిగిన ముల్లంగి ఆకులు
  2. 2కప్స్ పెసర పిండి
  3. కప్ కొత్తిమీర
  4. స్పూన్ పచ్చి కొబ్బరి పొడి
  5. చిన్న అల్లం ముక్క
  6. ఒకటి గాజర్ లేదా క్యారెట్
  7. 5పచ్చిమిర్చి
  8. స్పూన్ ధనియా పొడి
  9. స్పూన్ నువ్వులపొడి
  10. చిటికెడు ఇంగువ
  11. చిటికెడు పసుపు
  12. జిలకర ఒక స్పూన్
  13. నూనె /నెయ్యి
  14. ఉప్పు తగినంత
  15. కారం ఒక స్పూన్
  16. గరం మసాలా పొడి లేదా రసం పొడి ఒక spoon

సూచనలు

  1. మెదలు ముల్లంగి ఆకులు ముదురు కాడలు తీసి తరిగిపెట్టుకోవాలి
  2. కొతిమీరకుండా తరిగి పెట్టుకోవాలి
  3. మచ్చిమిర్చి తరిగి ,అల్లము పొట్టుతీసి తరిగిపెట్టుకోవాలి
  4. ముల్లంగి ఆకులు ,కొత్తిమీర పచ్చిమిర్చి ,అల్లం అన్నీ మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి
  5. గాజర్ కూడా తరిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  6. గ్రైండ్ చేసుకున్న ముల్లంగి ఆకు లో గాజర్ ముద్ద వేసుకోవాలి .
  7. ఇంగువ వేసుకోవాలి
  8. నువ్వుల పొడి వేసుకోవాలి
  9. ధనియాలపొడి వేసుకకోవాలి
  10. పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి
  11. పసుపు ఇంకా ,గరంమసాలా పొడి లేదా జిలకర పొడి వేసుకోవాలి .
  12. అన్నీ వేసాక తగినంత ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి కలపాలి .
  13. ఇప్పుడు అందులో పట్టినంత పెసర పిండి కలుపుకోవాలి .
  14. మొత్తం ఇలా ముద్దవలె చేసుకోవాలి .కాసేపు 5నిముషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి . (ఇష్టమున్నవాళ్ళు వెల్లుల్లి ముద్ద వేసుకోవచ్చు)
  15. పెనం పొయ్యి మీద పెట్టి వేడెక్కేలోగా పిండి ముద్దను ఉండలుగా చేసిపెట్టుకోవాలి
  16. ఒక్కొక్క ఉండ తీసుకొని కొద్దిగా నూనెతో అద్ది ఒక ప్లాస్టిక్ కవర్ పై పెట్టి జొన్న పిండివలె ఒత్తుకోవచ్చు .కాని అది అందరికి రాదు కాబట్టి పైనుంచి ఇంకో కవర్ వేసి చపాతీ కర్రతో ఒత్తుకోవాలి .పిండి వేసి కూడా ఒత్తుకోవచ్చు కాని అంటుకుంటుంది
  17. షేప్ సరిగ్గా రాదు .అందుకని ఏదైనా మూతతో ఒత్తుకోవాలి
  18. ఇలా రౌండ్ గ వస్తుంది
  19. ఇప్పుడు వేడి పెనం మీద వేసి మీడియం మంట మీద నెయ్యి కాని నూనె కాని వేసి కాల్చుకోవాలి .
  20. ఇలాగే రెండో వైపు కూడా బాగా కాల్చాలి .Nanstic పెనం అయితే నూనె అక్కరలేదు .
  21. ఇలా అన్నీ చేసిపెట్టుకొని ఏదైనా రైటా తో తినేయడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర