హోమ్ / వంటకాలు / గంగాబయల కూర మామిడికాయ పప్పు

Photo of Purslane leaves ,mango With toordal by kalyani shastrula at BetterButter
421
1
0.0(0)
0

గంగాబయల కూర మామిడికాయ పప్పు

Feb-18-2019
kalyani shastrula
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గంగాబయల కూర మామిడికాయ పప్పు రెసిపీ గురించి

గంగాబాయల మామిడికాయ పప్పు (కందిపప్పుతో)

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ప్రెజర్ కుక్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ తరిగిపెట్టుకున్న గంగబాయల కూర
  2. కప్ కందిపప్పు
  3. ఒక మామిడికాయ
  4. నూనె పోపుకు
  5. ఉప్పు
  6. కారం చెంచా
  7. ఆవాలు ,జిలకర అర చెంచా
  8. పసుపు ,ఇంగువ చిటికెడు
  9. పోపుకు శెనగపప్పు ,మినప్పప్పు ,చెంచా
  10. కొత్తిమీర కట్ట
  11. కరివేపాకు అయిదు ఆకులు

సూచనలు

  1. ముందుగా గంగాబాయల కూర కడిగి తరిగి పెట్టుకోవాలి
  2. కందిపప్పుతో ఈ కూర వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి
  3. మామిడికాయ పొట్టు తీసిపెట్టుకోవాలి
  4. మీడియం సైజు ముక్కలుగా తరంగాలి .
  5. మూకుడులో ఒక చెంచా నూనె వేసి మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి
  6. ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక ఉడికించుకున్న పప్పు వేసి ,తరిగిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి
  7. కొద్దిగా కారం ,ఉప్పు కూడా వేసి కాసేపు పొయ్యి మీద ఉంచి తీయాలి
  8. ఇప్పుడు ఒక మూకుడులో పోపుకు నూనె వేసి ,ఎండుమిర్చి శెనగపప్పు మినప్పప్పు ఆవాలు !,జిలకర ,పసుపు ,ఇంగువ కరివేపాకు ,వేసి వేగాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి పప్పులో కలపాలి .
  9. కమ్మనైన గంగబాయల కూర మామిడికాయ పప్పు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర