హోమ్ / వంటకాలు / నవరత్న పలావ్

Photo of Navaratna Palav by Sudha Badam at BetterButter
38
7
0.0(0)
0

నవరత్న పలావ్

Feb-18-2019
Sudha Badam
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నవరత్న పలావ్ రెసిపీ గురించి

ప్రోటీన్ సమృద్ధిగా లభించే ఒక రైస్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • కఠినము
 • పండుగలాగా
 • ఉత్తర భారతీయ
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. బాస్మతి బియ్యం 2 కప్పులు
 2. నీళ్లు 3 కప్పులు
 3. బాదం 10
 4. జీడిపప్పు 10
 5. కిస్మిస్ గుప్పెడు
 6. పన్నీర్ క్యూబ్స్ 100 గ్రాములు
 7. బంగాళదుంప పెద్దది 1
 8. క్యారెట్ 1
 9. గ్రీన్ పీస్ గుప్పెడు
 10. కాలీఫ్లవర్ 1/4 కప్పు
 11. ఉల్లిపాయలు 2
 12. పచ్చిమిర్చి 3
 13. కొత్తిమీర 1/4 కప్పు
 14. నిమ్మకాయ సగం చెక్క
 15. నూనె 3 స్పూన్లు
 16. నెయ్యి 3 స్పూన్లు
 17. ఉప్పు తగినంత
 18. షాజీరా 1 టీస్పూన్
 19. లవంగాలు 5
 20. దాల్చిన చెక్క అంగుళం ముక్క
 21. బిర్యానీ ఆకులు 2
 22. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్
 23. కుంకుమ పువ్వు చిటికెడు
 24. పాలు 2 స్పూన్లు

సూచనలు

 1. ముందుగా బియ్యం కడిగి ఒక గంట సేపు పక్కన ఉంచి 3 కప్పులు నీళ్లు పోసి పొడి పొడిగా అన్నం రెడీ చేసుకోవాలి.
 2. చిటికెడు కుంకుమపువ్వు ని2 స్పూన్ల పాలల్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి.
 3. స్టవ్ మీద పాన్ పెట్టి 3 స్పూన్లు నెయ్యి వేసి బాదం, జీడిపప్పు,కిస్మిస్ వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి.
 4. అదే నేతిలో పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
 5. కాలీఫ్లవర్, బంగాళదుంప,క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకుని, గ్రీన్ పీస్ తో కలిపి హాఫ్ బాయిల్ చేసుకోవాలి.
 6. అదే పాన్లో 3 స్పూన్లు నూనె వేసి షాజీరా, లవంగాలు, దాల్చిన, బిర్యానీ ఆకు వేసి వేగన్నిచ్చి దానిలో పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ చీలికలు వేసి వేగనివ్వాలి.
 7. అన్ని కొద్దిగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగన్నిచ్చి కూరగాయ ముక్కలన్ని వేసుకోవాలి.
 8. అన్ని కొద్దిగా మగ్గాక వండిన అన్నం, ఉప్పు వేసి బాగా కలిపి నానపెట్టిన కుంకుమపువ్వు పాలతో పాటుగా వేసి కలిపి 5 నిమిషాలు మూత పెట్టాలి.
 9. ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టుకున్న డ్రై fruits, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి అర చెక్క నిమ్మకాయ పిండి, కొత్తిమీర వేసి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చి స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర