హోమ్ / వంటకాలు / గుమ్మడిపలుకులు పల్లిపట్టి

Photo of Pumpkinseeds ,ground nut chikki by kalyani shastrula at BetterButter
434
3
0.0(0)
0

గుమ్మడిపలుకులు పల్లిపట్టి

Feb-20-2019
kalyani shastrula
20 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుమ్మడిపలుకులు పల్లిపట్టి రెసిపీ గురించి

గుమ్మడి పలుకులు ,పల్లీలు ,బెల్లం తో చేసే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ వేయించి పెట్టుకున్న పల్లీలు
  2. కప్ గుమ్మడి పలుకులు
  3. స్పూన్స్ తర్భుజా పలుకులు
  4. మూడు ఇలాయిచి
  5. 2కప్స్ బెల్లం
  6. 2tbsn. ఆవు నెయ్యి

సూచనలు

  1. ముందుగా పల్లీలు బాగావేయించాలి
  2. ముట్టుకుంటే పొట్టు ఊడి రావాలి అప్పుడు తీసి ఒక గుడ్డలో వేసుకోవాలి
  3. గుడ్డలో మూట కట్టి నెలకొడితే పొట్టు ఊడిపోతుంది
  4. ఇప్పుడు పల్లీలు ఒక చాట లేదా ఏదైనా ప్లేట్ లోకి తీసుకొని చెరిగితే పొట్టు వెళ్ళిపోతుంది .
  5. పొట్టుపోయి మిగిలిన పల్లీలు
  6. గుమ్మడిపలుకులు ,ok స్పూన్ తర్భుజా పలుకులు ,ముఫు ఇలాయిచిలు ఒలిచి ఇందులోనే వేసి ఉంచుకోవాలి .
  7. ఇప్పుడు తరిగిన బెల్లం లో కొద్ది నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి వేడిచేయాలి .
  8. కరిగిన బెల్లాన్ని వడపోసుకోవాలి .ఏదైనా మట్టి ఉంటే పోతుంది
  9. ఇప్పుడు మళ్లీ పొయ్యి మీద పెట్టి చిన్న మంటలో ఉడకనివ్వాలి .
  10. దగ్గర పడ్డాక రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి
  11. పాకం వచ్చేవరకు ఉడికిస్తూనే ఉండాలి
  12. ఇలా ఇక ప్లేట్ లో నీళ్లు పోసి కొద్దిగా పాకాన్ని వేస్తే వెంటనే గట్టిగా కావాలి .ఆ ఉండను కొడితే టంగ్ మని శబ్దం రావాలి
  13. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు ,పలుకులు వేసి కలపాలి .
  14. ఒక చెక్క పీటకు లేదా ఏదైనా ప్లేట్ కు నెయ్యి రాసి పెట్టుకోవాలి
  15. దానిమీద వెంటనే పాకాన్ని వేయాలి
  16. చపాతీ కర్రకు నెయ్యి రాసి దానిమీద సమానంగా ఒత్తుకోవాలి
  17. ఈ విధంగా నీట్ గ ఒత్తుకోవాలి
  18. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఒక స్కేల్ సాయంతో చాకుతో గాట్లు పెట్టుకోవాలి
  19. పూర్తిగా చల్లారాలి .అరగంట పక్కన పెట్టాలి .
  20. చల్లారాక చాకుతో నెమ్మదిగా చిక్కీలను తీసుకోవాలి
  21. ఈ విధంగా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి .
  22. ఇలా అందంగా డెకొరేషన్ చేసుకుంటే వెంటనే తినాలనిపించే ప్రోటీన్ చిక్కి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర