గోబి 65 | gobhi 65 Recipe in Telugu

ద్వారా Himabindu   |  20th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of gobhi 65 by Himabindu at BetterButter
గోబి 65by Himabindu
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

13

0

గోబి 65

గోబి 65 తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make gobhi 65 Recipe in Telugu )

 • కావలసినవి
 • 1 కాలిప్లవర్ చిన్న సైజ్
 • 2 చెంచా(tbsp) మైదా
 • 2 చెంచా(tbsp) బియ్యం పిండి
 • 1 చెంచా(tbsp)కార్న్ ఫ్లోర్
 • 1 1/2 చెంచా కారం
 • 1 చెంచా గరంమసాల
 • 1 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
 • ఉప్పు రుచికి సరిపడినంత
 • నూనె డీ ప్రై కి సరిపడినంత
 • కరివేపాకు గుప్పెడు
 • 1 చెంచా పసుపు
 • ఆరెంజ్ ఫుడ్ కలర్

గోబి 65 | How to make gobhi 65 Recipe in Telugu

 1. కాలిఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని అందులొ తగినన్ని నీరు,పసుపు,చిటికెడు ఉప్పు వేసి 2 నిమిషాలు ఉడికించాలి.
 2. ఇప్పుడు ఉడికిన కాలిఫ్లవర్ లోని నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
 3. ఇప్పుడు ఒక బౌల్ లో మైదా,బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కారం,గరంమసాల,అల్లం వెల్లుల్లి పేస్ట్,ఉప్పు,ఆరెంజ్ ఫుడ్ కలర్ అన్నింటిని మిశ్రమంలా కలుపుకోవాలి.
 4. మిశ్రమాన్ని మరీ గట్టిగ మరీ జారుడుగ కలుపుకోకూడదు,కొంచెం మద్యస్తంగా కలుపుకోవాలి.
 5. ఇప్పుడు కలిపిన మిశ్రమంలో ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలు వేసుకోని ఆ మిశ్రమం ముక్కలకు పట్టేల కలుపుకోవాలి.
 6. స్టవ్ వెలిగించి కడాయు లొ డీ ఫ్రై కి సరిపడినంత నూనె పోసుకొని ,నూనె మరిగాక ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగ నూనెలొ వేసుకోవాలి.
 7. గోబి ఫ్రై అయ్యాక పేపర్ టవల్ ప్లేట్లోకి తీసుకోవాలి.
 8. ఇప్పుడు మరిగే నూనె లొ కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని గోబి ని తీసుకున్న ప్లేట్ లోకి తీసుకోవాలి.

Reviews for gobhi 65 Recipe in Telugu (0)