హోమ్ / వంటకాలు / పల్లీల తో భక్షాలు

Photo of Peanut bobbatlu by kalyani shastrula at BetterButter
49
4
0.0(0)
0

పల్లీల తో భక్షాలు

Feb-22-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీల తో భక్షాలు రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • తెలంగాణ
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

 1. కప్ పల్లీలు వేయించి పొట్టుతీసుకున్నవి
 2. కప్ బెల్లం లేదా చెక్కర
 3. కప్ గోధుమపిండి లేదా మైదా
 4. పావు కప్ బొంబాయి రవ్వ లేదా చిరోటి రవ్వ
 5. ఉప్పు చిటికెడు
 6. నూనె
 7. ఇలాయిచి పొడి స్పూన్
 8. నెయ్యి
 9. పాలు ఒక స్పూన్

సూచనలు

 1. ముందుగా ఒక బౌల్ లో ఒక కప్ గోధుమపిండి తీసుకొని పావు కప్ బొంబాయి రవ్వ ,చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి . (మైదా లేదా చిరోటి రవ్వ వాడుకోవచ్చు .మైదా మంచిది కాదు అందుకే గోధుమపిండిని వాడాను .)
 2. తగినంత నీళ్లు పోసి మరి గట్టిగా కాకుండా కలిపి పై నుంచి కొద్దిగా నూనె వేసి మూత పెట్టి ఓ గంటపాటు పక్కన పెట్టుకోవాలి .
 3. ఈలోపు పల్లీలు చిన్న మంట పైన బాగా వేయించుకోవాలి
 4. పల్లి ముట్టుకుంటే పొట్టు ఊడి రావాలి .అప్పుడు వీటిని ఒక బట్టలో వేసి బాగా నలిస్తే పొట్టు పోతుంది .వాటిని ఒక చాట లోకి తీసుకొని చెరగాలి
 5. పొట్టు మొత్తం పోతుంది .ఇప్పుడు పల్లీలను ok బౌల్ లోకి తీసుకోవాలి
 6. ఇప్పుడు ఈ కప్ పల్లీలను మీక్సీ జార్ లో వేసి ,ఇలాయిచి కూడా వేసి పొడి చేసుకోవాలి
 7. కప్ బెల్లం కూడా తరిగి కొంచెం పల్లీల పొడి కూడా వేసి మీక్సీ చేసుకోవాలి .తీపి ఎక్కువగా తినే వాళ్ళు ఇంకో అర కప్ బెల్లం వేసుకోవచ్చు .(బెల్లం బదులు చెక్కర వాడవచ్చు .కాని చెక్కర మంచిది కాదు అందుకే నేను బెల్లం వేసాను)
 8. ఇప్పుడు పల్లి పొడి ,బెల్లం పొడి రెండు బాగా కలిపి మరోసారి మీక్సీ చేసుకోవాలి .
 9. ఇప్పుడు ముద్దగా అవుతుంది .లేనిచో కొద్దిగా పాలు కాని నీళ్లు కాని చిలకరించి కలుపుకోవాలి
 10. కొద్దిగా ముద్దగా అవుతుంది .ఈ పూర్ణాన్ని ఉండలుగా చేసి పెట్టుకోవాలి
 11. నానబెట్టుకున్న పిండిని కూడా అదే సైజు లో ఉండలు చేసి పెట్టుకోవాలి
 12. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొనే చివరలు కొద్దిగా ఒత్తుకొని మధ్యలో పూర్ణం ముద్ద పెట్టాలి
 13. చుట్టూ ఉన్న పిండి ముద్దను నెమ్మదిగా పూర్ణం చుట్టూతా కవర్ చేయాలి
 14. ఇలా చేసుకున్న దానిని పిండి వేసుకొని చపాతీ కర్రతో నెమ్మదిగా ఒత్తుకోవాలి
 15. ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసి ఒత్తుకుంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి సులభంగా ఉంటుంది .
 16. ఇలా ఎంత పలచగా నైనా ఒత్తుకోవచ్చు .ఇష్టాన్ని బట్టి కొంతమందికి లావుగా ఉంటేనే ఇష్టం .
 17. ఇలా ఒత్తుకున్న దానిని వేడిగా ఉన్న పెనం మీద వేయాలి
 18. ఇలాపొంగుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసి తిప్పి మరోవైపు కాల్చుకోవాలి
 19. మొత్తం చక్కగా కాలినాక తీసుకోవాలి
 20. అన్ని ఇలా సిద్ధం చేసుకుంటే నోరూరించే కమ్మని భక్షాలు సిద్ధం .
 21. ఒకవేళ చాలా పెద్దగా చేసుకుంటే చేతితో తీయడం కష్టం .అప్పుడు చపాతీ కర్రకు చుట్టుకొని పెనం మీద వేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర