మటర్ పరోట | Matar parota Recipe in Telugu

ద్వారా Himabindu   |  24th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Matar parota by Himabindu  at BetterButter
మటర్ పరోటby Himabindu
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

మటర్ పరోట వంటకం

మటర్ పరోట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Matar parota Recipe in Telugu )

  • 1 1/2 కప్పు మటర్
  • 1 కప్పు గోధుమ పిండి
  • 2 పచ్చిమిర్చి
  • చిన్న అల్లం ముక్క
  • కొతిమీర గుప్పెడు
  • 1చెంచా గరంమసాల
  • 1 చెంచా జీలకర్ర
  • 1 చెంచా ధనియాల పొడి
  • ఉప్పు రుచికి తగినంత

మటర్ పరోట | How to make Matar parota Recipe in Telugu

  1. ముందుగా మటర్ ని 5 గంటలు నాన బెట్టుకోవాలి.ఇప్పుడు నానబెట్టిన మటర్ ని 1 కప్పు కి 2 కప్పుల నీరు పోసి 5 విసిల్స్ వచ్ఛే వరకు కుక్కర్ లో ఉడికించుకోవాలి.
  2. ఇప్పుడు ఉడికించుకున్న మటర్ ని కొంచెం ఆరనివ్వాలి,తరువాత మటర్,మిర్చి,అల్లం గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బౌల్ లొ గోధుమ పిండి తీసుకొని అందులొ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం,జీలకర్ర,గరంమసాల,కొతిమీర,ధనియాల పొడి,ఉప్పు వేసుకొని ముద్ద లా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి పెనం వేడయ్యే లోపు ముద్దలా చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చదునుగ రుద్ది,రుద్దిన పరోటాని పెనం మీద వేసుకొని 1 చెంచా నూనె వేసి కాల్చుకోవాలి.
  5. అంతే ఎంతో రుచికరమైన మటర్ పరోట రెడీ.

Reviews for Matar parota Recipe in Telugu (0)