హోమ్ / వంటకాలు / చిల్లి పనీర్

Photo of Chilli Paneer by Lalitha Kandala at BetterButter
711
3
0.0(0)
1

చిల్లి పనీర్

Feb-25-2019
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిల్లి పనీర్ రెసిపీ గురించి

పనీర్ లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సొయా సాస్, స్ప్రింగ్ ఆనియన్ లాంటివి అన్ని వేసి చేసే చిల్లి పనీర్ రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • చైనీస్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ 20 ముక్కలు
  2. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  3. మైదా 2 చెంచాలు
  4. ఉప్పు కొద్దిగా
  5. గరం మసాలా 1 చెంచా
  6. మిరియాల పొడి అర చెంచా
  7. కారం కొద్దిగా
  8. నూనె 3 టేబుల్ స్పూన్స్
  9. సొయా సాస్ 1 టేబుల్ స్పూన్
  10. చిల్లి సాస్ అర టేబుల్ స్పూన్
  11. వినెగర్ 1 టీ స్పూన్
  12. బుట్ట మిరపకాయలు 1
  13. ఉల్లిపాయ 1
  14. అల్లం, వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్
  15. ఉల్లికాడలు ముక్కలు అర కప్
  16. టమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్
  17. కొత్తిమీర పావు కప్

సూచనలు

  1. ఒక గిన్నెలో మైదా, కార్న్, ఉప్పు, గరం మసాలా, కారం , మిరియాల పొడి , నీళ్లు పోసి పిండి కలపాలి
  2. పనీర్ ముక్కలు అందులో ముంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టాలి
  3. పాన్ లో నూనె వేసి వెల్లుల్లి , అల్లం ముక్కలు వేసి వేయించాలి
  4. అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ వేసి , ఉప్పు, మిరియాల పొడి వేసి ఎక్కువ మంట లో వేయించాలి
  5. సొయా సాస్, చిల్లి సాస్, వినెగర్ వేయాలి
  6. కారం వేసి, నీళ్లు పోయాలి
  7. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ వేసి నీళ్లు పోసి ముద్దలా చేసి పాన్ లో వేయాలి.
  8. అందులో టమాటో కెచప్ కూడా వేసి బాగా కలపాలి
  9. ఇప్పుడు వేయించిన పనీర్ ముక్కలు వేసి స్ప్రింగ్ ఆనియన్ కూడా వేయాలి
  10. పైన కొత్తిమీర జల్లి దించి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర