హోమ్ / వంటకాలు / చిల్లీ పన్నీర్ ( పొడిగా)

Photo of Chilli paneer (dry) by Swapna Tirumamidi at BetterButter
564
5
0.0(0)
0

చిల్లీ పన్నీర్ ( పొడిగా)

Feb-25-2019
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిల్లీ పన్నీర్ ( పొడిగా) రెసిపీ గురించి

చిల్లీ పన్నీర్ అనేది చిన్న పెద్ద అందరికి ఇష్టమేకదా అందులోనూ మాంసకృతల అధికం కదా..ఇది ఇండో చైనీ మేళవింపు.చాలా సులువు గా చేసుకోవచ్చు.భోజనానికి ముందు ఆధరవు(స్టార్టర్) లా తీసుకోవచ్చు.సాయం సంధ్యలో చిరితిండిలా తీసుకోవచ్చు.పిల్లలకి బడికి డబ్బాలో కూడా పెట్టవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పన్నీర్ ముక్కలు 250 గ్రాములు
  2. కార్న్ ఫ్లోర్ 3 పెద్దచెంచాలు
  3. మైదా 3 పెద్ద చెంచాలు
  4. మిరియం పొడి పావు చెంచా
  5. ఉప్పు తగినంత
  6. నూని దేవడానికి(డీప్ ఫ్రై) చాలినంత
  7. క్యాప్సికమ్ పెద్ద ముక్కలు 15( 3 రంగులులవి కలిపి)
  8. ఉల్లిపాయ పెద్దముక్కలు గా తరిగినది.(1 పెద్దఉల్లిపాయ)
  9. ఉల్లి కాడల తరుగు 2 పెద్ద చెంచాలు.
  10. కాశ్మీరీ ఎండు మిర్చి 4
  11. అల్లం ముక్క 1 అంగుళం
  12. వెల్లుల్లి సన్నగా తరిగినది 1 చెంచా
  13. పచ్చిమిర్చి 2
  14. టమాటా సాస్ 1 పెద్దచెంచా
  15. తేనె /పంచదార 1 చెంచా
  16. కార్న్ ఫ్లోర్ 1 చెంచా
  17. సొయా సాస్ 1 పెద్దచెంచా
  18. మిరియంపొడి అర చెంచా
  19. నూని 3 పెద్ద చెంచాలు.
  20. అజినోమోటో చిటికెడు(ఇష్టం ఉంటే)
  21. నిమ్మరసం/ వెనిగర్ 1 చెంచా.

సూచనలు

  1. ముందు ఒక కప్పు వేడి నీటిలో 4 కాశ్మీరీ ఎండుమిర్చి 10 నిమిషాలు నాన పెట్టాలి.
  2. పన్నీర్ ముక్కలు చతురస్రం గా చేసుకుని పెట్టుకోవాలి.
  3. ఒక గిన్నీలోకి 3 చెంచాల మైదా, 3 చెంచాలకార్న్ ఫ్లోర్,మిరియం పొడి పావు చేయించాడు ,ఉప్పు కొద్దిగా వేసి కొద్దిగా నీరుపోసి బజ్జి పిండిలా కలిపి పెట్టుకోవాలి.
  4. నూని పొయ్యిమీద పెట్టి వేడిచేసి,పన్నీర్ ముక్కలను పిండి మిశ్రమం లో ఒక్కొక్కటిగా ముంచి వేయించి పక్కన పెట్టుకోవాలి.
  5. క్యాప్సికమ్,ఉల్లిపాయలను పెద్దముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.ఉల్లిని ముక్కలు విడదీసి పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు నానపెట్టిన మిరపకాయలు (నీటితో పాటుగా),అల్లం మ్ముక్క..మిక్సీలో మెత్తగా చేసి పెట్టుకోవాలి.
  7. 1 పెద్దచెంచా కార్న్ ఫ్లోర్ ని 2 చెంచాల నీటిలో కలిపి ఉంచాలి.
  8. ఇప్పుడు మూకుడులో 2 చెంచాల నూని వేసి వేడిచేసి వెల్లుల్లి తరుగు,పచ్చి మిర్చి చీలికలు,వేసి కలిపి మిరప ముద్దని కూడవేసి కలపాలి...మిక్సీ జారులో కొద్దిగా నీళ్లుపోసి అవికూడా వేసి 3 నిమిషాలు వేయించాలి.నీరు ఇగిరి పోవాలి.ఇప్పుడు దాన్ని ఒకచిన్న గిన్నీలోకి తీసుకుని పెట్టుకోవాలి.దీనిని చిల్లీ సాస్ అంటారు.
  9. ఇప్పుడు అదే మూకుడు లో మళ్ళీ కొద్దిగా నూని వేసి పెద్దగా తరిగి విడదీసిపెట్టిన ఉల్లిపాయముక్కలు వేసి,30 క్షణాలు వేయించి,క్యాప్సికమ్ కూడా వేసి మరో 30 క్షణాలు వేయించాలి.(ఈ ప్రక్రియ అంతా కాస్త పెద్దమంట మీద పెట్టి గబగబా కలుపుతూ చెయ్యాలి. కూర ముక్కలు మాడకూడదు,ఎక్కువ ఉడక కూడదు..కరకర లాడుతున్నట్టు ఉండాలి.
  10. ఇప్పుడు అందులో తయారుచేసిన చిల్లీ సాస్ ,సోయసాస్, మిరియం పొడి,టమాటా సాస్,అజినోమోటో,నిమ్మరసం/వెనిగర్ వేసి,తేనె, కొద్దిగా ఉప్పు వేసి బాగాకలిపి నీటిలో కలిపి ఉంచిన కార్న్ ఫ్లోర్ ని పోసి బాగా కలపాలి కాస్త దగ్గర పడేదాకా.
  11. ఇప్పుడు వేయించిన పన్నీర్ ముక్కలు ,ఉల్లికాడల తరుగు వేసి బాగా కలిపి వడ్డించుకునే పాత్రలోకి తీసుకుని వడ్డించుకోవాలి.
  12. అంతే చక్కని రుచికరమైన చిల్లీ పనీర్ సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర