సాంబార్ | Sambar Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  26th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Sambar by Vasuki Pasupuleti at BetterButter
సాంబార్by Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

9

0

సాంబార్ వంటకం

సాంబార్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sambar Recipe in Telugu )

  • పావుకేజీ కందిపప్పు
  • చింతపండు 50 గ్రాములు
  • కారం 2 చెంచాలు
  • పసుపు అర చెంచా
  • ధనియాలపొడి ఒక చెంచా
  • ఉల్లిపాయలు 2
  • టమాటాలు 2
  • కరివేపాకు 2 రెమ్మలు
  • కొత్తిమీర 2 రెమ్మలు
  • సాంబార్ పొడి 2 చెంచాలు
  • వంకాయలు 2
  • ముల్లంగి 1
  • మునగ కాయ 1
  • క్యారెట్ 1
  • మామిడికాయ సగం
  • బెండకాయలు 10
  • ఉప్పు సరిపడే
  • నూనె సరిపడే
  • ఇంగువ చిటికెడు
  • పచ్చిమిరపకాయలు 2

సాంబార్ | How to make Sambar Recipe in Telugu

  1. ముందుగా ఉడకపెట్టిన పప్పును మెత్తగా యెనుపుకోవాలి తరువాత కూరగాయలు అన్నీ ముక్కలుగా కోసుకోవాలి (కరోట్, వంకాయ , బెండకాయ, ముల్లంగి, మామిడికాయ, ఉల్లిపాయలు, టమాటాలు)
  2. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసి పోపు పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపాలి తరువాత ముల్లంగి వేసి బాగా వేపాలి
  3. తరువాత బెండకాయ, క్యారెట్ , టమాటాలు వేసి బాగా కలపాలి కొంచెము సేపు వేపాలి
  4. అవి వేగే టప్పుడు వంకాయలు కోసుకోవాలి
  5. కొంచమూసేపు వంకాయలు వేసి బాగా వేపాలి
  6. తరువాత ఉప్పు కారం ఇంగువ పసుపు ధనియాలపొడి వేసి కొద్ది సేపు మగ్గించాలి
  7. కొద్దిగా నీళ్లు పోసుకొని మరిగించాలి ఆ తరువాత చింతపండు రసము వడకట్టుకొని పోయాలి
  8. తరువాత ఏనుపుకున్న పప్పును అందులో పోయాలి
  9. అప్పుడు సాంబార్ పొడి వేసి బాగా వుడికించాలి
  10. ఇలాగ బాగా తెర్ల పెట్టాలి
  11. రుచికరమైన సాంబార్ సిద్దము

నా చిట్కా:

వంకాయలు ముందే కోయకూడదు స్టవ్ మీద గిన్నె పెట్టినప్పుడు కోసుకోవాలి ఎందుకంటే వంకాయ రుచి మారిపోతుంది

Reviews for Sambar Recipe in Telugu (0)