హోమ్ / వంటకాలు / మూంగ్ దాల్ పన్నీర్ చీల

Photo of Moong dal cheela with stuffed paneer by Aparna Reddy at BetterButter
653
2
0.0(0)
0

మూంగ్ దాల్ పన్నీర్ చీల

Feb-26-2019
Aparna Reddy
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మూంగ్ దాల్ పన్నీర్ చీల రెసిపీ గురించి

పెసరపప్పు,మినపపప్పు,పన్నీర్,కూరగాయలు వేసుకొని చేసుకోడం వలన ప్రోటీన్ లు ఎక్కవగా లభిస్తాయి.లంచ్ బాక్స్ ల కి చాలా బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1 కప్ పెసరపప్పు
  2. 1/4 కప్ మినపపప్పు
  3. 1 చిన్న అల్లం ముక్క
  4. 2 పచ్చిమిర్చి
  5. 1 చెంచా జీలకర్ర
  6. 1/4 చెంచా పసుపు
  7. 1/4కప్ కొత్తిమీర తరుగు
  8. ఫిల్లింగ్ కొరకు :
  9. 1 కప్ పనీర్ తురుము
  10. 1/2కప్ ఉల్లి తరుగు
  11. 1/4 కప్ క్యాప్సికమ్ ముక్కలు
  12. 1/4 కప్ క్యారెట్ ముక్కలు
  13. 1/4 కప్ పచ్చి బఠాణీలు
  14. 2 పచ్చిమిర్చి
  15. 1/4చెంచా మిరియాల పొడి
  16. ఉప్పు తగినంత
  17. నూనె తగినంత

సూచనలు

  1. పెసరపప్పు, మినపపప్పు ముందుగా 4 గంటలు నానపెట్టుకొని ఉంచుకోవాలి.
  2. బాగా నానిన తరువాత మిక్సీకప్ లో పెసరపప్పు,మినపపప్పు.అల్లం,మిర్చి, జీలకర్రవేసుకొని బాగా తిప్పుకోవాలి.
  3. బాగా మెత్తగా అయిన తరువాత కొత్తిమీర,పసుపు,ఉప్పు వేసుకొని బాగా తిప్పుకుని కొద్దికొద్దిగా నీళ్లు వేసుకోవాలి.మరి పలుచగా కాకుండా కొంచెం మందము గా పిండి ఉంచుకోవాలి
  4. ఇప్పుడు స్టఫ్ చేసుకోడం కొరకు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి.నూనెకాగిన తరువాత ఉల్లిపాయలు వేసుకోవాలి.
  5. ఉల్లి పాయలు దోరగా వేగినతరువాత మిగిలిన కూరగాయలు వేసుకోవాలి.
  6. అన్ని కూరగాయలు కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోవాలి.
  7. ఇప్పుడు కొంచెం ఉప్పు,పసుపు,మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి.
  8. చివరగా పన్నీర్ తురుము వేసుకొని తడి లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి.పైన కొత్తిమీర తరుగు వేసుకోవాలి.
  9. పైన తయారు అయిన మిశ్రమాన్ని చల్లారనివ్వాలి
  10. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోస పాన్ పెట్టుకొని పైన రెడి చేసుకొని ఉంచిన పిండి తో దోసలా వేసుకోవాలి.
  11. రెండు వైపులా నూనె వేసుకొని బాగా కాలనివ్వాలి. చీల రెడీ.
  12. మూంగ్ దాల్ చీల ను ప్లేట్ లో కు తీసుకొని పైన రెడి గా ఉంచుకున్న పనీర్ కూర ను మధ్యలో పెట్టుకోవాలి.
  13. ఇప్పుడు చీల ను రెండు వైపులా మడుచుకొని రోల్ ల చేసుకోవాలి.
  14. అంతే ఎంతో రుచిగా ఉండే మూంగ్ దాల్ చీల విత్ స్టఫ్ఫ్డ్ పనీర్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర