హోమ్ / వంటకాలు / బ్రౌన్ రైస్ తో బిర్యానీ సొయా చుంక్స్ మరియు పనీర్ తో

Photo of Brown rice biryani with soya chunks paneer and mix vegs by Shobha.. Vrudhulla at BetterButter
41
5
0.0(0)
0

బ్రౌన్ రైస్ తో బిర్యానీ సొయా చుంక్స్ మరియు పనీర్ తో

Feb-26-2019
Shobha.. Vrudhulla
90 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రౌన్ రైస్ తో బిర్యానీ సొయా చుంక్స్ మరియు పనీర్ తో రెసిపీ గురించి

ఇందులో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నాయి.బ్రౌన్ రైస్,సొయా,పనీర్,మిక్స్ వెజ్ అన్ని వేయటం వల్ల చాలా హై లెవెల్ లో ప్రోటీన్స్ ఉన్నాయి యింకా చాలా రుచిగా కూడా ఉంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • రాత్రి విందు
 • ఉత్తర భారతీయ
 • మితముగా వేయించుట
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

 1. 1కప్ సోయా చంక్స్ (20 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానపెట్టి ఉంచుకోవలెను)
 2. 1 కప్ పనీర్ ముక్కలు వేయించినవి
 3. బీన్స్ అర కప్
 4. శిమ్లా మిర్చి తరరిగినది అర కప్పు
 5. క్యారెట్ తరుగు అర కప్పు
 6. కాలిఫ్లవర్ / పువ్వు 1కప్పు
 7. ఆలూ తరిగినది అర కప్పు
 8. పచ్చి బఠాణి 1 కప్పు
 9. స్వీట్ కార్న్ అర కప్పు
 10. ఉల్లిపాయలు తరిగినవి 1 కప్
 11. ఉల్లిపాయలు అర కప్పు డీప్ ఫ్రై చేసినవి మీదనుంచి వేయటానికి
 12. పచ్చి మిర్చి 3 నిలువుగా కట్ చేసుకోవాలి
 13. కుంకుమ పువ్వు చిటికెడు
 14. పాలు అర కప్పు ( అందులో కుంకుమ పువ్వు నాన పెట్టి ఉంచాలి)
 15. ఉప్పు తగినంత
 16. కారం 2 చంచాలు
 17. బిర్యానీ మసాలా 3 చంచాలు
 18. గరం మసాలా లవాంగ, దాల్చిన చెక్క , ఇలాచి పెద్దది చిన్నది, పువ్వు, ఆకు, జాజికాయ
 19. నూనె మరియు బట్టర్ 1/4 కప్పు
 20. బ్రౌన్ బియ్యము 2 గ్లాసులు కడిగి నానా పెట్టి గంట పాటు ఉంచాలి

సూచనలు

 1. ముందుగా బియ్యo నానిన తరువాత ఆ నీళ్లలోనే కాస్త ఉప్పు , నూనె వేసుకొని ఉడికించుకొని తీసి బట్ట మీద ఆర పెట్టు కో వలెను.
 2. సొయా ని కూడా నీళ్ళల్లోంచి తీసి బాగ పిండి వాటిని కాస్త పచ్చి వాసన పోయే వరకు నూనె లో వేయించి తీసి పక్కన పెట్టాలి
 3. ఇప్పుడు పనీర్ కూడా వేయించి ఉంచుకోవలెను
 4. అన్ని కూరలు దగ్గర పెట్టుకోవలెను
 5. ఇప్పుడు అన్ని కూరలు వేయించి ఉంచాలి విడివిడిగా.
 6. ఇప్పుడు మూకుడులో నూనె మరియు బటర్ వేసి కాగాక మసాలా దినుసులు వేసి వేగాక ఉల్లిపాయలు మిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి
 7. ఇవి వేగాక కూరలు పనీర్ సొయా అన్ని వేసుకొని వాటిలో ఉప్పు, కారం , ధనియాల జీలకర్ర పొడి,బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి
 8. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో చక్కగా బట్టర్ వేసి ముందుగా చల్లార్చుకున్న అన్నము ఒక లేయర్ వేసి దానిమీద అన్ని కలిపి వేయించిన కూరలు వేయాలి.3వ లేయర్ మళ్ళీ అన్నము వేసి దాని మీద కుంకుమ పువ్వు పాలు పోసి అప్పుడు మళ్ళీ నాలుగవ లేయర్ లో మిగిలిన కూర బాగా వేసి దాని మీద కొత్తి మీరు మరియు పుదీనా వేసి చక్కగా కుక్కర్ మూత పెట్టాలి విజిల్ లేకుండా.
 9. అలా స్టవ్ ని సిం లో పెట్టి 10 నిమిషాలు వరకు ఉంచాలి
 10. 10 నిమిషాలు తరువాత తీసి ఒక సెర్వింగ్ ప్లేట్ లో బిర్యానీ వేసి దానిమీద బాగ క్రిస్పీ గా వేయించిన ఉల్లిపాయలు వేసి కొత్తిమీర వేసి ఏదైనా రాయితతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
 11. బ్రౌన్ రైస్ అవటం వల్ల కలర్ అంతగా తెలియదు కాని రుచి చాలా బాగుంది.
 12. అంతే ఎంతో రుచికరమయిన బ్రౌన్ రైస్ తో బిర్యానీ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర