హోమ్ / వంటకాలు / పన్నీర్ గుత్తివంకాయ మసాలా

Photo of Paneer stuffed brinjal by Swapna Tirumamidi. at BetterButter
837
5
0.0(0)
0

పన్నీర్ గుత్తివంకాయ మసాలా

Feb-26-2019
Swapna Tirumamidi.
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ గుత్తివంకాయ మసాలా రెసిపీ గురించి

గుత్తి వంకాయ అంటే ఇష్టం లేనిదెవరికి చెప్పండి.నేను కొంచం కొత్తగా చేసాను. ఇది అన్నం లోకి ,చపాతీలోకీ కూడా అద్భుతంగా ఉంటుంది. వేరుశెనగ, నువ్వులు,పనీర్ మొదలైన పదార్ధాలు ఇందులో ఉన్నాయి కాబట్టి పోషక విలువలకు లోటు ఏమీలేదు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. చిన్న లేత వంకాయలు అర కేజీ
  2. పనీర్ ముక్కలు 200 గ్రాములు
  3. వేరుశెనగ గుళ్ళు 1 కప్పు
  4. నూపప్పు 1 కప్పు
  5. ధనియాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. మినపప్పు 2 చెంచాలు
  8. శెనగ పప్పు2 చెంచాలు
  9. వెల్లుల్లి 5 రెబ్బలు
  10. అల్లం ముక్క 2 అంగుళాలు
  11. కారం 2 చెంచాలు
  12. ఉప్పు సరిపడా..
  13. ఉల్లిపాయలు 3 పెద్దవి
  14. పచ్చి కొబ్బరి అర కప్పు
  15. కొత్తిమీర తరుగు గుప్పెడు.
  16. కసూరి మెంతి 2 చెంచాలు.
  17. నూని/బటర్ అరకప్పు.
  18. పసుపు 2 చిటికెలు.

సూచనలు

  1. ముందు పల్లీలు, నూపప్పు పొడిగా కమ్మగా వేయించి పక్కన పెట్టి,అదే మూకుడులో నూనె లేకుండా జీలకర్ర, ధనియాలు,మినప్పప్పు, శెనగపప్పు కూడా కమ్మగా వేయించి చల్లారాక మిక్సీలో పొడి కొట్టిపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు అదే పొడిలో 3 ఉల్లిపాయ లని తరిగి వేసి,కారం,ఉప్పు,అల్లం,వెల్లుల్లి,పచ్చికొబ్బరి వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా మిక్సీలో చేయాలి.
  3. ఈ మిశ్రమాన్ని విడిగా గిన్నీలోకి తీసుకుని అదే మిక్సిజారులో పన్నీర్ ముక్కలు వేసి 2 తిప్పులు తిప్పి పొడి చేసుకోవాలి.
  4. మిక్సీలో వేసి తిప్పితే బావుంటుంది . నీరు అస్సలు తగలనివ్వకుండా మిక్సీ వెయ్యాలి.అప్పుడు కింద చూపినవిధంగా అవుతుంది.
  5. ఇప్పుడు ఈ పనీర్ పొడిని ముందుగా తయారుచేసిన మిశ్రమం లో వేసి బాగా కలపాలి.
  6. పొయ్యిమీద మూకుడు పెట్టి నూని లేదా వెన్న వేసి వేడయ్యాక కాస్త పసుపు వేసి సన్న సెగ మీద ఉంచి వంకాయలు గుత్తిలా తరిగి వాటిల్లో తయారు చేసిన మిశ్రమాన్ని ఎక్కువ మోతాదులో కూరి మెల్లగా కాగిన నూనెలోకి జారవిడుస్తూ ఉండాలి .(ఇలాంటి వాటికి సమాంతరంగా ఉన్న వెడల్పాటి మూకుడు ఉంటే అన్నికాయలు సమానంగా మగ్గి ఏ కాయకి ఆ కాయ విడివిడిగా ఉంటుంది.)
  7. ఇప్పుడు సెగ కాస్త పెంచి తయారు చేసిన మిశ్రమం ఏదైనా మిగిలితే వంకాయలపై వేసి మరో 2 చెంచాల నూని ,ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అరకప్పు నీళ్లు చల్లి మూత పెట్టాలి .
  8. తరువాత కాయలన్ని ఒక్కొక్కటిగా చెంచా తో రెండవ పక్కకు తిప్పి మరో 10 నిమిషాలు మగ్గనివ్వాలి.ఇప్పుడు కసూరి మెంతిని వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి.
  9. ఒక కాయని తీసి ముచ్చిక ఉడికిందోలేదోచూసి ఉడికిపోతే కనుక చపాతిలోకి కావాలను కుంటే ఈ స్థాయిలో దించేసి కొత్తిమీర చల్లుకుని వడ్డించవచ్చు.
  10. అన్నం లోకి తినాలనుకుంటే ఇంకొక 5 నుండి 6 నిమిషాలు అలాగే మగ్గించుకుంటే ఇంకా దగ్గర పడుతుంది.
  11. కూర తయారయ్యాక ఒక గిన్నీలోకి తీసుకుని మళ్ళీ పైన కాస్త కొత్తిమీర ,పన్నీర్ కోరు చల్లి వడ్డించుకుంటే సరి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర