కూరగాయల సాంబార్ | Mixed vegetables sambar Recipe in Telugu

ద్వారా sneha gilla  |  27th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mixed vegetables sambar by sneha gilla at BetterButter
కూరగాయల సాంబార్by sneha gilla
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

కూరగాయల సాంబార్ వంటకం

కూరగాయల సాంబార్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed vegetables sambar Recipe in Telugu )

  • కందిపప్పు 125 gr
  • చింతపండు 50gr
  • కారం 2 స్పూన్స్
  • ఉప్పు 2 స్పూన్స్
  • పసుపు 1 స్పూన్
  • ధనియపొడి 1 స్పూన్
  • సాంబర్ మసాలా 1 స్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు,జిలకర 1 స్పూన్
  • ములక్కాడలు 6
  • వంకాయలు 2
  • ఆలు 2
  • టమాటా 1
  • బెండకాయలు 4
  • క్యారెట్స్ 4
  • సొరకాయ ముక్కలు 1 కప్
  • కరివేపాకు రెండు రెమ్మలు
  • కొత్తిమీర

కూరగాయల సాంబార్ | How to make Mixed vegetables sambar Recipe in Telugu

  1. ముందుగా కందిపప్పును కుక్కర్లో 3 విజిల్స్ పెట్టి ఉడికించి ఉంచాలి.
  2. చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. కూరగాయలను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  4. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు,అల్లం వెల్లుల్లి పేస్ట్,పసుపు,కరివేపాకు వేసి ఆ తర్వాత కూరగాయ ముక్కలను కూడా వేసి వేగనివ్వాలి.
  5. అవి వేగాక అందులో చింతపండు రసం,పప్పు,కారం,ఉప్పు,ధనియా పొడి వేసి బాగా మరిగించుకోవాలి.
  6. అది మరుగుతుండగా సాంబార్ మసాలా కూడా వేసి మరి కొద్దిసేపు మరిగించుకోవాలి.చివరిగా కోతిమీర వేసి దించేయాలి

నా చిట్కా:

ఇది రైస్ తో మరియు టిఫిన్స్ తో కూడా తినటానికి బాగుంటుంది.

Reviews for Mixed vegetables sambar Recipe in Telugu (0)