హోమ్ / వంటకాలు / ఎగ్ సోయా నూడుల్స్

Photo of Egg soya noodles by SwathiBindhu Peeta at BetterButter
522
4
0.0(0)
0

ఎగ్ సోయా నూడుల్స్

Feb-27-2019
SwathiBindhu Peeta
25 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ సోయా నూడుల్స్ రెసిపీ గురించి

ప్రోటీన్లు ఎక్కువగా వున్న స్నాక్/ అల్పాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • చైనీస్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. నూడుల్స్ 100 grms
  2. తరిగిన ఉల్లిపాయ 1
  3. తరిగిన క్యాప్సికమ్ 3 రంగులు 1/4th కప్పు
  4. తరిగిన క్యారట్ చిన్నది 1
  5. తరిగిన వెల్లుల్లి 1/2 టీ స్పూన్
  6. సోయా 1/2 కప్పు
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. నూడిల్స్ మసాలా ప్యాక్ 1
  10. సోయా సాస్ 1/2 టీ స్పూన్
  11. వెనిగర్ 1/2 టీ స్పూన్
  12. నూనె 1 1/2 టీ స్పూన్
  13. గుడ్లు 2

సూచనలు

  1. ఒక గిన్నలోకి నీళ్ళు తీసుకొని అవి వేడి చేయాలి. అందులో కొంచం నూనె వేసుకొని అందులో నూడుల్స్ వేసుకుని 5-7 నిముషాల పాటు ఉడికించాలి. అలాగే సోయా ని ఒక గిన్నెలో నీళ్లు పోసి నాన పెట్టాలి.
  2. ఇప్పుడు ఉడికిన నూడుల్స్ ని చల్లని నీళ్లలో వేసుకుని ఒక 2 నిముషాల పాటు వుంచి వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బాండీ లో నూనె వేసుకొని అందులో తరిగిన వెల్లుల్లి వేసుకుని పెద్ద మంట మీద వేయించాలి.
  4. ఇప్పుడు అందులో తరిగిన కూరగాయల ముక్కలు వేసుకుని వేయించాలి.
  5. ఇప్పుడు అందులో నాన పెట్టుకుని ఉంచుకున్న సోయా ని వేసుకుని వేయించాలి.
  6. తరువాత అందులో రెండు గుడ్లు వేసుకుని బాగా కలపాలి.
  7. ఇప్పుడు వెనిగర్ మరియు సోయా సాస్ వేసుకుని బాగా కలపాలి.
  8. ఇప్పుడు అందులో సరిపడినంత ఉప్పు, కారం మరియు నూడిల్స్ మసాలా వేసుకుని బాగా కలపాలి.
  9. ఇప్పుడు అందులో వుడికించిన నూడుల్స్ వేసుకుని బాగా కలపాలి.
  10. నూడుల్స్ సిద్దం.
  11. ఒక ప్లేట్ లోకి తీసుకుని వడ్డించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర