హోమ్ / వంటకాలు / చిక్కుడు గింజల మసాలా కూర

Photo of Broad beans masala by Swapna Tirumamidi. at BetterButter
681
2
0.0(0)
0

చిక్కుడు గింజల మసాలా కూర

Feb-27-2019
Swapna Tirumamidi.
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కుడు గింజల మసాలా కూర రెసిపీ గురించి

చిక్కుడు గింజలు మసాలా కూర . ముదిరిన కాయలు వలచి గింజలు విడిగా తీసి కూర చేసాను. 3 రకాల గింజలు ఇందులో వాడటం జరిగింది.ఈ కూర అన్నంలోకి,చపాతీ లాంటి రొట్టెల్లోకి ,ఇంకా వెరైటీ రైస్ లోకి కూడా మంచి ఆధరవు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చిక్కుడు గింజలు 2 కప్పులు
  2. పెద్ద ఉల్లిపాయలు 3
  3. టొమాటో పేస్ట్ 1 కప్పు
  4. ధనియాలు 2 చెంచాలు
  5. జీలకర్ర అర చెంచా
  6. అల్లం 2 అంగుళాల ముక్క
  7. వెల్లుల్లి 5 రెబ్బలు
  8. కారం 2 చెంచాలు
  9. పసుపు పావు చెంచా
  10. వేయించిన నువ్వులు 5 చెంచాలు
  11. వేయించిన పల్లీలు 2 చెంచాలు
  12. పచ్చి కొబ్బరి కోరు 5 చెంచాలు
  13. కసూరి మెంతి అర చెంచా
  14. కొత్తిమీర 4 చెంచాలు
  15. ఉప్పు సరిపడా
  16. బటర్ లేదా నూని 5 చెంచాలు
  17. ఎర్రగా కాచిన పాలు అరకప్పు.

సూచనలు

  1. ముందు మిక్సీలో ధనియాలు ,జీలకర్ర ,పసుపు,కొద్దిగా ఉప్పు,కారం,వేయించిన పల్లిలు మరియు నువ్వులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  2. మళ్ళీ అందులోనే పచ్చి కొబ్బరి,అల్లం,వెల్లుల్లి,ఉల్లిపాయలు వేసి ముద్దగా చేసుకోవాలి.
  3. మూకుడులో బట్టర్ వేసి వేడిచేసి ముద్ద చేసిన మసాలా మిశ్రమాన్ని వేసి కాసేపు వేపి,టొమాటో ముద్దకూడా వేసి పచ్చి వాసన పోయేలా వేయించాలి.
  4. ఇప్పుడు పచ్చి చిక్కుడు గింజలు వేసి, కొద్దిగా నీరు పోసి కలిపి మూటపెట్టి ఉంచాలి.ఇక్కడ నేను 3 రకాల గింజలు తీసుకున్నాను.
  5. ఉప్పు సరి చూసుకుని,తగినన్ని నీళ్ళుపోసి మూత పెట్టి 15 నిముషాలు అయ్యాక పాలు పోసి ఉడకనివ్వాలి.గింజలు వేలితో నొక్కితే పిండి అవ్వాలి.
  6. గింజలు బాగా ఉడికి ,మూకుడు అంచులు నూని వదులుతున్నప్పుడు కసూరి మెంతి వేసి ,కలిపి కొత్తిమీర వేసి దించుకోవాలి.
  7. అంతే అండి చక్కని చిక్కుడు గింజల మసాలా సిద్ధం అయినట్టే. వేరే గిన్ని లోకి తీసుకుని వడ్డించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర