హోమ్ / వంటకాలు / పల్లీ పట్టి

Photo of Peanut chikki / Brittle  by Aparna Reddy at BetterButter
743
5
0.0(0)
0

పల్లీ పట్టి

Feb-28-2019
Aparna Reddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీ పట్టి రెసిపీ గురించి

వేరుశనగ పప్పులు,బెల్లంవెసుకొని చేసుకోవడంవలన పిల్లలలకు,పెద్దలకు మంచి ప్రోటీన్స్ ఇస్తుంది.ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 2 కప్స్ వేరుశనగ పప్పులు
  2. 11/2సీపీ బెల్లం
  3. 2 చెంచాల నీళ్లు
  4. 2 చెంచాల నెయ్యి

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి వేరుశనగ పప్పులు వేసుకోవాలి.
  2. సన్నని మంట మీద దోరగా వేయించుకోవాలి.
  3. వేయించిన పప్పులను పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఒక పెద్ద మందంగా ఉన్న పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం వేసుకోవాలి.
  5. నీళ్లు వేసుకొని బెల్లము కరిగే వరకు గరిటతో కలుపుతూ ఉండాలి.
  6. సన్నని మంట మీద బెల్లం ముదురు పాకం వచ్చే వరకు చూసుకోవాలి.
  7. పాకం గట్టి పడ్డ వెంటనే పల్లి పప్పులు వేసుకోవాలి.
  8. పాకం బాగా కలిసేవరకు బాగా కలపాలి.
  9. నెయ్యి రాసిఉంచిన ప్లేట్ లో వెంటనే వేసుకోవాలి.పైన ఓ కప్పు తీసుకొని వత్తుకోవాలి.
  10. చల్లారిన తరువాత మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి.
  11. అంతే ఎంతో రుచిగా ఉండే పల్లి పట్టి తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర