హోమ్ / వంటకాలు / వెజ్ మెక్సికన్ రాజ్మా పాలక్ టాకోస్

Photo of Veg mexican bean tacos by Aparna Reddy at BetterButter
155
3
0.0(0)
0

వెజ్ మెక్సికన్ రాజ్మా పాలక్ టాకోస్

Feb-28-2019
Aparna Reddy
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ మెక్సికన్ రాజ్మా పాలక్ టాకోస్ రెసిపీ గురించి

వెరైటీ గా తినాలి అనుకొనే వారికి మంచి స్నాక్.రాజ్మా,పనీర్,బ్రోకలివాడడం వలన ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • కిట్టి పార్టీలు
 • మెక్సికన్
 • చిన్న మంట పై ఉడికించటం
 • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

 1. టాకో తయారీకి:
 2. 1/4 కప్ గోధుమ పిండి
 3. 1/4 కప్ మైదా పిండి
 4. 1/4కప్ పాలక్ పేస్ట్
 5. ఉప్పు తగినంత
 6. నూనె తగినంత
 7. రాజ్మా టాపింగ్ కొరకు:
 8. 2 కప్స్ 4 గంటలు నానపెట్టి ఉంచిన ఎరుపు రంగు రాజ్మా గింజలు
 9. 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు
 10. 1 కప్ టొమోటో జ్యూస్
 11. 1 చెంచా చిల్లీ పౌడర్
 12. 1 చెంచా దనియా పౌడర్
 13. 1/4 చెంచా గరం మసాలా పొడి
 14. ఉప్పు తగినంత
 15. నూనె
 16. 1చెంచా అల్లం వెల్లులి పేస్ట్
 17. సాల్సా కొరకు:
 18. 1/4కప్ పనీర్ ముక్కలు
 19. 1/4కప్ బ్రోకలి
 20. 1/4కప్ సిమ్లా మిర్చి ముక్కలు
 21. 1/4కప్ కారేట్ ముక్కలు
 22. 1/4కప్ పొడుగుగా తరిగిన క్యాబేజీ
 23. 1/4 చెంచా ఆలివ్ ఆయిల్
 24. 1/4చెంచా మిరియాల పొడి
 25. కొత్తిమీర
 26. పుదీనా
 27. చెక్కర 1/4స్పూన్
 28. 1/4చెంచా నిమ్మరసం
 29. 2 స్పూన్స్ మాయనిస్

సూచనలు

 1. మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి,మైదాపిండి,పాలక్ గుజ్జు,ఉప్పు,నూనె వేసుకిని కొద్ది కొద్ది గా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
 2. ఇప్పుడు పిండి ని చిన్న ఉండలుగా చేసుకొని చపాతీల వత్తుకొని పెనం మీద నూనె లేకుండా రెండువైపులా కొద్దిగా కాల్చు కోవాలి.
 3. సగం కాల్చిన చపాతీ ని టూత్ పిక్ తో పొడుచుకుని బాండీ లో నూనె వేడిచేసుకొని పురిలా వేయించుకోవాలి
 4. కాలిన పూరీని మధ్యకు ఫోల్డ్ చేసుకొని టాకో షేప్ చేసుకోవాలి
 5. రాజ్మా కూర కొరకు:
 6. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి నూనె వేసుకొని వేడి అయ్యాక జీలకర్ర వేసుకోవాలి.
 7. తరిగిన ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేగిన తరువాత టొమోటో జ్యూస్,అల్లంవెల్లులి పేస్ట్ వేసుకోవాలి.
 8. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
 9. కారం,ఉప్పు,దనియాపౌడర్, గరం మసాలపొడి వేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని మూతపెట్టి మగ్గనివ్వాలి.బాగా దగ్గర అయ్యే వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.
 10. అంతే రాజ్మా కూర రెడి.
 11. సాల్సా కొరకు:
 12. స్టవ్ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి.
 13. ఇప్పుడు పనీర్ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
 14. తరువాత క్యారెట్ ముక్కలు,క్యాప్సికమ్ ముక్కలు , క్యాబేజీ తరుగు వేసుకొని మగ్గనివ్వాలి.
 15. చివరగా బ్రోకలి వేసుకొని పైన ఉప్పు ,మిరియాల పొడి,కొద్దిగా చెక్కర,నిమ్మరసం వేసుకొని అన్ని కలిసే వరకు ఫ్రై చేసుకోవాలి.
 16. గ్యాస్ ఆఫ్ చేససు కొని పక్కన పెట్టుకోవాలి.
 17. ఇప్పుడు టాకో ఫిల్లింగ్ చేద్దాము.
 18. ముందుగా టాకో స్ ,రాజమాఫిల్లింగ్,వెజ్ సాల్సా అన్ని ఒక చోట పెట్టుకోవాలి.
 19. టాకో తీసుకొని ముందు గా 1 చెంచు రాజ్మా కూర వేసుకోవాలి.
 20. పైన రెడి చేసిన సాల్సా అనగా పనీర్,బ్రోకలి,క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొనిటాప్ లో మయోనిస్ వేసుకోవాలి.
 21. అంతే మిగిలిన అన్ని టాకో లను కూడా పైన చెప్పిన ప్రకారం మనకు నచ్చినట్లు స్టఫ్ చేసుకోవాలి.
 22. అంతే వెజ్ మెక్సికన్ రాజ్మా టాకో స్ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర