హోమ్ / వంటకాలు / పనీర్ క్యాప్సికమ్ మసాలా

Photo of Paneer capsicum masala by Rashmi SudhiMurthy at BetterButter
880
4
0.0(0)
0

పనీర్ క్యాప్సికమ్ మసాలా

Feb-28-2019
Rashmi SudhiMurthy
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ క్యాప్సికమ్ మసాలా రెసిపీ గురించి

పనీర్ తో ఎన్ని వెరైటీలు చేసిన చపాతీలోకి కొత్త రుచిని ఇస్తుంది. పనీర్ ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ ముక్కలు 1 కప్
  2. క్యాప్సికమ్ ముక్కలు 1 కప్
  3. టొమాటో 2
  4. ఉల్లిపాయలు 2
  5. పచ్చిమిర్చి2
  6. అల్లం 1 చిన్న ముక్క
  7. వెల్లుల్లి 10
  8. పసుపు 1/4 టీ స్పూన్
  9. జీడిపప్పు 1 టేబుల్ స్పూన్
  10. బాదం పప్పు 1 టేబుల్ స్పూన్
  11. మసాల దినుసులు : లవంగా 2
  12. షాహీ జీరా 1 టీ స్పూన్
  13. దాల్చిని చెక్క 1 ఇంచ్
  14. ఏలకులు 2
  15. బిర్యానీ ఆకు 1
  16. గరం మసాలా 1 టీ స్పూన్
  17. కారం పుడి 2 టీ స్పూన్లు
  18. కిచెన్ కింగ్ మసాలా 1 టీ స్పూన్
  19. కసూరి మేథీ 1 టీ స్పూన్
  20. ధనియాల పుడి 1/2 టీ స్పూన్
  21. ఉప్పు రుచికి సరిపడా
  22. నూనె 2 టేబుల్ స్పూన్లు
  23. నీళ్ళు తగినంత
  24. కరివేపాకు 2 రెమ్మలు
  25. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా పనీర్ ముక్కలకు ఉప్పు, కిచెన్ కింగ్ మసాలా వేసి కలిపి పెట్టాలి
  2. ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు,అల్లం, వెల్లుల్లి, టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి
  3. అందులో జీడిపప్పు, బాదంపప్పు, పసుపు, ఉప్పు కూడా వేసి వేపాలి.చల్లారాక మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో మసాలా దినుసులు వేసి వేపి ఉల్లిపాయ ముక్కలు,క్యాప్సికమ్ ముక్కలు,కరివేపాకు వేసి ఫ్రై చేయాలి
  5. అది వేగాక అందులో రెడీ చేసుకున్న టొమాటో పేస్ట్ వేసి బాగా ఫ్రై చెయ్యాలి
  6. ఇప్పుడు అందులో కారం పుడి,గరంమసాలా,ధనియాల పుడి, రెడీ చేసుకున్న పనీర్ ముక్కలు వేసి తగినంత నీళ్ళు పోసి వేగనివ్వాలి
  7. చివరిగా కసూరి మేథీ, కొత్తిమీర వేస్తే పనీర్ క్యాప్సికమ్ మసాలా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర