హోమ్ / వంటకాలు / పనీర్ కేబాబ్

Photo of Paneer  kebab sttuffed with soya,spinach and mix veg by Shobha.. Vrudhulla at BetterButter
428
2
0.0(0)
0

పనీర్ కేబాబ్

Feb-28-2019
Shobha.. Vrudhulla
25 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ కేబాబ్ రెసిపీ గురించి

ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది పనీర్ ఉండటం వల్ల.ఇంకా లోపల స్టఫింగ్ కూడా చాలా బలమైన వి ఉండటం వల్ల ఎంతో ఆరోగ్యం కూడాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ అర కేజీ
  2. సొయా చంక్స్ ( నానపెట్టి ముద్ద చేసుకోవాలి )
  3. ఆలూ 3 ఉడికించి తరిగినవి
  4. పాలకూర తరిగినది ఒక పెద్ద కప్పు
  5. క్యారెట్ అర కప్పు తరిగినది
  6. శిమ్లా మిర్చి అర కప్పు తరిగినది
  7. కార్న్ ఫ్లోర్ ఒక కప్పు నీళ్ళల్లో కలిపి ఉంచుకోవాలి
  8. ఓట్స్ ఒక కప్పు
  9. ఉప్పు తగినంత
  10. కారము 2 చంచాలు
  11. ధనియా పొడి 2 చంచాలు
  12. గరం మసాల పొడి అర చంచ
  13. కొత్తిమీరు అర కప్పు
  14. నూనె 1కప్పు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి దానిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి.
  2. అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వెగాక పచ్చి మిర్చి కట్ చేసి వేసి వేగాక ఉల్లిపాయలు వేసి కాస్త వేగనివ్వాలి.
  3. ఇప్పుడు ఇందులో కూరలు తరిగినవి వేసి వేగాక, పాలకూర వేసి మగ్గించాలి. ఇప్పుడు రుబ్బి ఉంచిన సొయా చంక్స్ పేస్ట్ వేసి బాగా కలిపి అప్పుడు ఉప్పు,కారం,మసాలా పొడి,ధనియా పొడి, వేయించిన కాజు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు పనీర్ ముక్కని తీసుకొని దాని మీద ఈ కూరని పెట్టి దానిమీద మరో పనీర్ ముక్కని పెట్టి బాగా రెండు గట్టిగా నొక్కి త్రిభుజాకారంలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే అన్ని తయారు చేసి పెట్టుకోవాలి
  5. ఇప్పుడు ఈ పనీర్ ని కార్న్ ఫ్లోర్ పేస్ట్ లో( కాస్త పల్చగా చేసుకోవాలి ముద్దగా ఉండకూడదు) ముంచి తీసి ఓట్స్ లో బాగా రెండు వైపులా దొర్లించుకొని వాటిని షేల్లో ఫ్రై చేసుకోవాలి
  6. స్టవ్ మీద పెనం పెట్టి షేల్లో ఫ్రై కి తగ్గట్టు నూనె వేసి అందులో ఇవి వేయించాలి
  7. అన్ని పక్కల బాగా వేయించాక తీసి ప్లేట్ లో పెట్టిగ్రీన్ చట్నీ తో తింటే చాలా రుచిగా ఉంటుంది.
  8. అంతే ఎంతో రుచి మరియు బలమయిన పనీర్ కేబాబ్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర