హోమ్ / వంటకాలు / అవిశ ఖర్జూర నట్స్ బర్ఫీ(లడ్డూలు)

Photo of Dryfruits laddu,burfi by Chandrika Marripudi at BetterButter
572
2
0.0(0)
0

అవిశ ఖర్జూర నట్స్ బర్ఫీ(లడ్డూలు)

Feb-28-2019
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిశ ఖర్జూర నట్స్ బర్ఫీ(లడ్డూలు) రెసిపీ గురించి

జీడిపప్పు, బాదం,వాల్నట్స్,పిస్తా, అవిశగింజలు,ఖర్జూరం వేసి చేసిన తీపి వంటకం. నట్స్ లో ,అవిశల్లో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో పంచదార, బెల్లం, నెయ్యి కొంచం కూడా వేయలేదు. ఖర్జూరం సహజమైన తీపి దనం ,బలం కూడా పిల్లలకు, పెద్దలకు అందరికీ బలవర్ధకమైనది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. జీడిపప్పు : 1/2 కప్పు
  2. బాదం : 1/2 కప్పు
  3. పిస్తా : 1/4 కప్పు
  4. వాల్నట్స్ : 1/2 కప్పు
  5. అవిశగింజలు : 1 కప్పు
  6. ఖర్జూరపళ్ళు : 1/2 కేజీ
  7. పాలు : చిన్న గిన్నెడు

సూచనలు

  1. పిస్తా వలుచుకుని పప్పులు తీసి పెట్టుకోవాలి
  2. ఖర్జూరపళ్ళు వలిచి గింజలు తీసి పెట్టుకోవాలి.
  3. నట్స్, అవిశగింజలు విడి వాడిగా నూనె, నెయ్యి ఏమీ వేయకుండా వేయించి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు మిక్సి గిన్నెలో నట్స్ వేసి బరకగా మిక్సి పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  5. అవిశగింజలు కూడా మిక్సీ పట్టి గిన్నెలో వేసుకోవాలి.
  6. ఖర్జూరపళ్ళు కూడా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే ఒక చెంచా పాలు వేసి మిక్సీ పట్టి దాన్ని కూడా గిన్నెలోకి తీసుకోవాలి.
  7. అన్నిటినీ చేత్తో బాగా కలుపుకోవాలి ముద్దలా అయేలాగా.
  8. ఇలా చేసుకున్న దాన్ని మనకు నచ్చినట్లుగా లడ్డూలు లా లేదా నచ్చిన ఆకారంలో చేసుకుని ప్లేటులోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర