హోమ్ / వంటకాలు / ఆలు పన్నీర్ కోఫ్తా

Photo of Alu paneer by kalyani shastrula at BetterButter
17
1
0.0(0)
0

ఆలు పన్నీర్ కోఫ్తా

Feb-28-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు పన్నీర్ కోఫ్తా రెసిపీ గురించి

ఆలు ,పన్నీర్ తో చేసే కోఫ్తా

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • తెలంగాణ
 • వెయించడం/స్టిర్ ఫ్రై
 • సైడ్ డిషెస్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

 1. నాలుగు పెద్ద ఆలుగడ్డలు .చిన్నవి అయితే పది
 2. 100gr.పనీర్
 3. ఉప్పు తగినంత
 4. 4 టమాటాలు
 5. 3పచ్చిమిర్చి
 6. ఇంగువ 1/2స్పూన్
 7. జిలకర స్పూన్
 8. పసుపు స్పూన్
 9. అల్లం ఇంచ్ ముక్క
 10. నూనె గోలించుకోవడానికి
 11. ధనియా పొడి స్పూన్ ,
 12. గరం మసాలా పొడి స్పూన్
 13. కారం 2 స్పూన్స్
 14. కార్న్ ఫ్లోర్ కప్ (లేదా సరిపడా)
 15. కప్ గసగసాలు నానబెట్టి పేస్ట్ చేసినది
 16. నాలుగు బాదాం ,నాలుగు కాజు ,10కిస్మిస్
 17. బట్టర్ 1 tbsn.

సూచనలు

 1. ముందుగా ఒక గంట పాటు గసగసాలు నానబెట్టి ఉంచుకోవాలి .ఈలోపు కుక్కర్లో ఆలు ఉడికించి పెట్టుకోవాలి
 2. బాగా నానిన గస గసాలును పేస్ట్ చేసి పెట్టుకోవాలి
 3. అల్లం ,పచ్చిమిర్చి టమాటా మీక్సీ చేసి పెట్టుకోవాలి
 4. బాదాం కాజు కిస్మిస్ లు
 5. బాదాం కాజు కిస్మిస్ దంచి పెట్టుకోవాలి
 6. ఉడికిన ఆలూను పొట్టు తీసి పెట్టుకోవాలి
 7. ఆలూను ఒక బౌల్ లోకి తీసుకొని చిదిమి ,అందులో పనీర్ తురుముకోవాలి
 8. కార్న్ ఫ్లోర్
 9. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ పట్టినంత వేసి ,పచ్చిమిర్చి తురుము ,కొత్తిమీర ,ఇంగువ వేసి ,ధనియా పొడి పావు స్పూన్ వేసి ముద్దగా చేసుకోవాలి
 10. ఈ విధంగా ముద్దగా అవుతుంది .
 11. కొద్ది ఆలు ముద్దని రౌండ్ గా చేసి ఒత్తి మధ్యలో బాదాం ముద్దను కొద్దిగా పెట్టి మూసేసి బాల్స్ వలె చేసిపెట్టుకోవాలి
 12. ఇలా మొత్తం ముద్దను చేసి పెట్టుకోవాలి .
 13. ఇప్పుడు ఒక్కొక్క కోఫ్తా ను కాగుతున్న నూనెలో వేసి గోలించుకోవాలి
 14. రెండు వైపులా గోలినాక తీసి పక్కన పెట్టుకోవాలి
 15. గోలించుకున్న కోఫ్తా లు
 16. ఇప్పుడు పాన్ లో మూడు చెంచాల నూనె వేసి జిలకర పసుపు ,వేసి టమాటా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి వేగనివ్వాలి
 17. ఇప్పుడు గసగసాల పేస్ట్ వేయాలి
 18. కొద్దిగా ఉడికాక బట్టర్ వేసి మూత పెట్టు ఉంచాలి
 19. దగ్గర పడి నూనె పైకి తేలుతున్నప్పుడు కారం వేయాలి .
 20. గరం మసాలా ,ధనియా పొడి కొత్తిమీర వేయాలి
 21. రెండు గ్లాస్ ల నీళ్లు పోయాలి . ఉప్పు వేసి మూత పెట్టి మరగనివ్వాలి
 22. గ్రేవీ ఉడికి కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేయాలి .గ్రేవీ మరి పలచగా ,మరి చిక్కగా ఉండకూడదు .
 23. ఇప్పుడు తయారుచేసుకున్న కోఫ్తా లు గ్రేవీ లో వేసి మూత పెట్టి ఓ అయిదు నిముషాలు ఉంచాలి .
 24. తర్వాత సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి .
 25. కమ్మ కమ్మటి అలుపనీర్ కోఫ్తా చపాతీ ,లోకి అన్నం లోకి కూడా బాగుంటుంది .అసలు వట్టి కోఫ్తాలు తినేయవచ్చు .అంత కమ్మగా ఉంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర