హోమ్ / వంటకాలు / సోజ్జ పిండితో కచోరీ

Photo of Bajra kachori by Shobha.. Vrudhulla at BetterButter
16
2
0.0(0)
0

సోజ్జ పిండితో కచోరీ

Feb-28-2019
Shobha.. Vrudhulla
20 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోజ్జ పిండితో కచోరీ రెసిపీ గురించి

ఇది రాజస్థాని వంట.చాలా వెరైటీగా ఉంటుంది.రుచి కూడా చాలా బాగుంది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • కిట్టి పార్టీలు
 • రాజస్థాన్
 • వేయించేవి
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

 1. 350 గ్రా సజ్జ పిండి
 2. 150 గ్రా మైదా
 3. 180 గ్రా రవ్వ
 4. 200 గ్రా ఉడికించిన పచ్చి బఠాణి
 5. 7 to 8 ఉడికించి తొక్క తీసిన ఆలూ
 6. 2 పెద్ద ఉల్లిపాయలు తరిగినవి
 7. 2 పెద్ద టమాటాలు తరిగినవి
 8. 1కప్ ఉల్లి కాడలు
 9. 1 కప్ వెల్లుల్లి కాడలు పచ్చవి
 10. 1 కప్ కొత్తిమీర
 11. 1 పెద్ద చెంచా చాట్ మసాలా
 12. 1 పెద్ద చెంచా గరం మసాలా
 13. 1 చెంచా ఆవాలు
 14. 3 చంచాలు నువ్వులు
 15. 6 to 7 పచ్చిమిర్చి తరిగినవి
 16. అర చంచా పసుపు
 17. ధనియాల పొడి అర చెంచా
 18. జీరా పొడి అర చెంచా
 19. కారము 1 చెంచా
 20. ఉప్పు తగినంత
 21. నూనె డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

 1. ముందుగా సోజ్జ పిండి ,మైదా,రవ్వ,నువ్వులు,ఉప్పు తగినంత వేసి నీళ్లతో కలిపి బాగా 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచుకోవలెను
 2. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడెక్కాక ఆవాలు వేసి వేగాక అందులో ఉల్లిపాయలు వేసి కాస్త వేగాక మిర్చి కూడా వేసి వేగిన తరువాత ఆలూ మటర్ వేసి 2 నిమిషాలు ఉంచాలి
 3. ఆ తరువాత అందులో కొత్తిమీర ,ఉల్లి కాడలు,వెల్లుల్లి కాడలు ,టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి
 4. మగ్గిన తరువాత ఉప్పు,పసుపు,కారము,దనియా పొడి,జీరా పొడి,చాట్ మసాలా,గరం మసాలా వేసి బాగా కలిపి 2 నిమిషాల వరకు ఉంచి పక్కకు దించి చల్లారాక చిన్న ఉండలు చేసుకోవలెను కచోరీ కోసం
 5. ఇప్పుడు పిండి మరో సారి బాగా కలిపి ఉండలు చేసి చేతి మీద చిన్న పూరి లా వత్తి అందులో ఈ కూరని నింపుకొని నాలుగు వైపులా నుంచికావేర్ చెస్త్తూ దాన్ని కచోరీ సైజ్ లో పెద్దది గా వత్తుకోవాలి .
 6. వత్తె అప్పుడు అంచులు కట్ అవ్వకుండా చేతులు తడి చేస్తూ వత్తుకొని పెద్దదిగా చేయాలి ఇలా అన్నీ నింపుకొని కచోరీలు చేసుకొని పక్కన పెట్టుకోండి
 7. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి కాగాక కచోరీ ఒక్కక్కటి జాగ్రత్తగా వేయించాలి.వేసిన తరువాత సిం లో పెట్టి వెయిస్తే లోపల నుంచి కూడా బాగా వేగుతుంది.
 8. ఇదే విధంగా అన్ని వేయించి తీసుకొని చట్నీ తో తింటే చాలా రుచిగా ఉంటాయి .కాస్త వెరైటీగా కూడా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర