శాకాహార ప్రోటీన్ థాలి | vegetarian Protein Platter Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  28th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of vegetarian Protein Platter by Pravallika Srinivas at BetterButter
శాకాహార ప్రోటీన్ థాలిby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  24

  గంటలు
 • వండటానికి సమయం

  2

  గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

5

0

శాకాహార ప్రోటీన్ థాలి వంటకం

శాకాహార ప్రోటీన్ థాలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make vegetarian Protein Platter Recipe in Telugu )

 • సందేశ్ బెల్లంతో కి కావాల్సిన పదార్థాలు :
 • పనీర్ - 1/2 కేజీ
 • బెల్లం - సుమారు 50 గ్రాములు
 • యాలుకల పొడి - పావు స్పూను
 • అలంకరణకు - డ్రైఫ్రూయిట్స్
 • కొర్రలు తవ పులావ్ కి కావాల్సిన పదార్ధాలు :
 • కొర్రలు - 1 కప్పులు
 • నీరు - 2 కప్పులు
 • క్యారెట్ - 1
 • బీన్స్ - 6
 • పనీర్ క్యూబ్స్ - చిన్న గా తరిగినవి పావు కప్పు
 • మొక్కజొన్న గింజలు - పావు కప్పు
 • హోల్ గరం మసాలా దినుసులు - తగినన్ని
 • అల్లం వెల్లులి పేస్ట్ - 1/2 స్పూను
 • పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ - 1/2 స్పూను
 • ఉప్పు - తగినంత
 • వెన్న నూనె - 4 స్పూన్లు
 • మొక్కజొన్న గారెలు కి కావాల్సిన పదార్ధాలు :-
 • మొక్కజొన్న పచ్చి గింజలు - 3 కండెలు
 • పచ్చిమిర్చి : 4
 • అల్లం - 1 అంగుళం
 • ఉల్లితరుగు - 1 పాయ
 • కొత్తిమీర లేదా కరివేపాకు - 2 రెమ్మలు
 • జీలకర్ర : 1 స్పూను
 • ఉప్పు - తగినంత
 • నూనె - డీప్ఫ్రై కి సరిపడా
 • ఉలవలు మంచురియా కి కావాల్సిన పదార్ధాలు :-
 • ఒకరోజు నానినవి - పావు కిలో
 • ఉప్పు - తగినంత
 • కారం - 1/2 స్పూన్
 • కార్న్ ఫ్లోర్ - 1 స్పూన్
 • మైదా - 1 స్పూన్
 • నూనె - డీప్ ఫ్రై కి
 • టమాటో సాస్ - 3 స్పూన్లు
 • వినిగర్ - 1/2 స్పూను
 • వెల్లుల్లి రెబ్బలు తరిగినవి - 1 స్పూను
 • ఉల్లితరుగు - చిన్న పాయ
 • నీరు - తగినంత
 • సోయా పరాటాలు కి కావాల్సిన పదార్ధాలు : -
 • సోయా చంక్స్ - 1 కప్పు
 • గోధుమపిండి - 2 కప్పులు
 • ఉప్పు - తగినంత
 • పచ్చిమిర్చి తరుగు - 2
 • సన్నని ఉల్లితరుగు - 1
 • గరం మసాలా పొడి - 1 స్పూను
 • నీరు & నూనె - తగినంత
 • రాజ్మా చాట్ కి కావాల్సిన పదార్ధాలు : -
 • ఒకరోజు నానిన రాజ్మా - 1 కప్పు
 • టమాటో - 1
 • ఉల్లిపాయ - 1
 • పుదీనా - 4 ఆకులు
 • నిమ్మరసం - 1/2 స్పూన్
 • ఉప్ఫ - తగినంత

శాకాహార ప్రోటీన్ థాలి | How to make vegetarian Protein Platter Recipe in Telugu

 1. (1). సందేశ్ బెల్లంతో తయారీ విధానం :- పన్నీర్ వేడి నీటిలో వేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.మెత్తగా మెదిపి పెట్టుకోవాలి.
 2. బెల్లం తురిమి కళాయిలో వేసి కొంచం నీరు చల్లి మెదిపిన పన్నీర్ వేసి కలుపుకోవాలి.
 3. ఇప్పుడు యాలుకల పొడి వేసి కలిపి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి నచ్చిన ఆకారంలో చేస్కోవచ్చు.
 4. పైన కొంచం బాదం తురిమి అలంకరించుకోవాలి.అంతే బెల్లం సందేశ్ రెడీ...
 5. (2).కొర్రలు తవ పులావ్ తయారు చేయు విధానం :- ముందుగా కొర్రలు కడిగి పావుగంట నాననిచ్చి నీరు వేసి ఉడికించుకోవాలి.
 6. ఇప్పుడు కళాయి వేడి చేసి వెన్న ,నూనె వేసి షాజీరా,బిర్యానీ ఆకు,పట్టా,లవంగం,యాలుకలు,అనాసి పువ్వు వేసి చిటపటలాడాకా తరిగిన కూరగాయలు,పచ్చి బఠాణీలు,మొక్కజొన్న గింజలు వేసి కలుపుకొని ఉప్పు,అల్లంవెల్లుల్లి పేస్ట్,పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసి మగ్గనివ్వాలి.
 7. ఇప్పుడు ఉడికించిన కొర్రన్నం ని వేసి బాగా కలుపుకోవాలి.చివరిగా పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి.అంతే వేడి వేడి కొర్రలు తవ పులావ్ రెడీ...
 8. (3).మొక్కజొన్న వడలు తయారీ విధానం :- ముందుగా మిక్సర్ జార్లో వలిచిన పచ్చి మొక్కజొన్న గింజలను,అల్లం,పచ్చిమిర్చి,ఉప్పు వేసి కచ్చపచ్చ గా గ్రైండ్ రుబ్బుకోవాలి.
 9. డీప్ ఫ్రై కి నూనె పెట్టి జీలకర్ర,కొత్తిమీర వేసి వడలు వేసి మీడియం మంట మీద దోరగా కాల్చుకోవాలి.
 10. అంతే వేడి వేడి మొక్కజొన్న వడలు రెడీ....
 11. (4).ఉలవలు మంచురియా :- ముందుగా ఉలవలు రోజంతా నాననిచ్చి ఉడికించి చల్లార పెట్టుకోవాలి.
 12. మిక్సర్ జార్లో ఉలవలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.కొంచం ఉప్పు,కారం,కార్న్ ఫ్లోర్,మైదా వేసి కలుపుకోవాలి.
 13. తయారైన మిశ్రమాన్ని బాల్స్ చేస్కుని డీప్ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
 14. ఇప్పుడు కడాయిలో వెన్న వేసి వెల్లుల్లి తరుగు,ఉల్లితరుగు,రెడ్ క్యాప్సికమ్ తరుగు వేసి వేగిన తర్వాత టమాటో సాస్,వెనిగర్ ,కొంచం కార్న్ ఫ్లోర్ కలిపిన నీరు వేసి బాల్స్ వేసి దగ్గర పడనివ్వాలి.
 15. పైన స్ప్రింగ్ ఆనియన్ తరుగు వేసి ప్లేట్ లోకి తీసుకోవాలి.అంతే ఉలవలు మంచురియా రెడి...
 16. (5).సోయా పరాటాలు తయారు చేయు విధానం :- ముందుగా గోధుమపిండి, ఉప్పు,నీరు,1 స్పూన్ నూనె వేసి చాపతి ముద్ద లాగా కలుపుకోని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
 17. సోయా చంక్స్ వేడి నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత నీరు పిండి మిక్సర్ జార్ లో కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
 18. కడాయిలో నూనె వేసి కాగాక జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు,ఉల్లితరుగు,ఉప్పు వేసి వేగాక సోయా మిశ్రమం వేసి మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి.
 19. ఇప్పుడు చపాతీ ముద్దను భాగాలు చేసి పెట్టి ఒక పిండి ముద్దను రౌండ్ గా రుద్దుకోవాలి.
 20. మధ్యలో సోయా మిశ్రమం ఉంచి సీల్ చేసి మరొకసారి పొడిపిండి చల్లి వత్తుకోవాలి.
 21. వేడి చేసిన పెనం పైన నూనె వేసి మీడియం మంట పైన రెండు వైపులా కాల్చుకోవాలి.
 22. అంతే రుచికరమైన సోయా పరాటాలు రెడీ...
 23. (6).నాటు రాజ్మా సలాడ్ తయారీ విధానం :- ముందుగా నాటు రాజ్మా 24 గంటలు నాననిచ్చి ఉడికించిపెట్టుకోవాలి.
 24. ఒక బౌల్ లో ఉల్లితరుగు, టమాటో తరుగు,ఉడికించిన రాజ్మా,ఉప్పు,నిమ్మరసం,పుదీనా వేసి సర్వ్ చేసుకోవాలి.
 25. ఇప్పుడు తయారు చేసిన అన్నింటిని ప్లేట్ లోకి అమార్చుకోవాలి.

నా చిట్కా:

చిరుధాన్యలు,పప్పులు వండేటప్పుడు ముందు నాననిచ్చి ఉప్పు వేయడం వలన త్వరగా ఉడికిపోతాయి.ఉలవలు నానిన నీరు చారు పెట్టుకోవచ్చు.

Reviews for vegetarian Protein Platter Recipe in Telugu (0)