హోమ్ / వంటకాలు / ప్రోటీన్ పవర్ పంచ్ స్మూతీ

Photo of Protein power punch smoothie by Swapna Tirumamidi at BetterButter
687
3
0.0(0)
0

ప్రోటీన్ పవర్ పంచ్ స్మూతీ

Feb-28-2019
Swapna Tirumamidi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ పవర్ పంచ్ స్మూతీ రెసిపీ గురించి

పీనట్ బటర్ అంటే ఇష్టం లేనివారికి ఈ విధంగా చేసి ఇస్తే వారి అయిష్టాన్ని పోగొట్టవచ్చు.ఇందులో అవకాడో, అరటిపండు ,చియా గింజలు లాంటివి ఉపయోగించడం జరిగింది. ఇది అత్యంత బలవర్ధకము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కలయిక
  • చిలకడం
  • చల్లటి పానీయం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు 250 మి .లీ
  2. పీనట్ బటర్ 3 పెద్ద చెంచాలు
  3. అరటి పండు 1 పెద్దది
  4. పండిన అవకాడో 1
  5. తాజా క్రీము 2 పెద్ద చెంచాలు.
  6. ఐస్ ముక్కలు 6
  7. మాపెల్ సిరప్ 3 పెద్ద చెంచాలు
  8. బాదం పలుకులు 5
  9. చియా గింజలు 1 పెద్ద చెంచాడు.

సూచనలు

  1. చియా గింజలు అరకప్పు వెచ్చని నీటిలో నాన పెట్టి ఉంచాలి.
  2. అవకాడోని మధ్యకి తరిగి అందులోని గింజను తీసేసి గుజ్జును తీసుకోవాలి.
  3. ఒక బ్లెండరు జారులో పైన చెప్పిన జాబితాను అనుసరించి అన్ని వరుసగా వేసి 4 నిమిషాలు తిప్పాలి.
  4. అన్నీ బాగా కలిసిన తరువాత నాన పెట్టిన చియా గింజలు(కొన్ని పక్కన పెట్టాలి) వేసి మరోసారి బ్లెండరు తిప్పాలి.
  5. ఇప్పుడు ఒక పొడి గాజు జారు అంచులమీదుగా మాపెల్ సిరప్ ని వేసి,జారు అడుగున మిగిలిన చియా గింజలు వేసి స్మూతీ ని పోసుకుని పైన బాదం పప్పులు ,నచ్చిన పళ్ళు పెట్టి అలంకరించుకుంటే ప్రోటీన్ పవర్ పంచ్ స్మూతీ సిద్దం.(నేను రెడ్ కరెంట్ పళ్ళు ఉపయోగించాను)

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర