హోమ్ / వంటకాలు / బ్రోకలి నూపప్పు కూర

Photo of Broccolli curry with seasame. by Swapna Tirumamidi at BetterButter
393
2
0.0(0)
0

బ్రోకలి నూపప్పు కూర

Feb-28-2019
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రోకలి నూపప్పు కూర రెసిపీ గురించి

బ్రోకలి చూడ్డానికి కాలిఫ్లవర్ లా రంగు మాత్రం ఆకుపచ్చగా వుంటుంది .దీనిలో చాలా పోషకాలు వున్నాయి.మాంసకృతులు,ఇనుము తదితర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.వీటి మొగ్గల్లో మాంసకృతులుంటే వాటి కాడల్లో ఇనుప ఖనిజాలు ఎక్కువ ఉన్నాయి.దీనికి ప్రత్యేకమైన రుచి ఏమి ఉండదు కాబట్టి అన్ని రకాలలోను కలిపి వండుకోవచ్చు.ఈ బ్రోకలి ని సలాడ్లులో వాడుకోవచ్చు,సూపుల్లా చేసుకోవచ్చు,కూరల్లా కూడా చేసుకోవచ్చు.ఇక్కడ మీకు కమ్మగా వుండే,పిల్లలకు నచ్చే విధంగా చెబుతున్నాను.ఈ కూర అన్నం లోకి చాలా బావుంటుంది.అతి తక్కువ సమయం లో చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రోకలి పువ్వు పెద్దది 1
  2. నూపప్పు 1 కప్పు
  3. శెనగ పప్పు 2 చెంచాలు
  4. మినపప్పు 1 చెంచా
  5. ఆవాలు అర చెంచా
  6. జీలకర్ర అర చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. పచ్చి మిర్చి 3
  9. ఎండు మిర్చి5
  10. ఉప్పు రుచికి తగినట్టుగా
  11. పసుపు చిటికెడు
  12. వెల్లుల్లి రెబ్బలు 5...6 సన్నగాతరిగినవి
  13. కరివేపాకు 3 రెమ్మలు
  14. నూని 4 చెంచాలు

సూచనలు

  1. బ్రోకలిని (కాలిఫ్లవర్ తరిగినట్టు గా) తరిగి వేడినీటిలోవేసి, ఉప్పువేసి 10 నిమిషాలు ఉంచాలి.కాడలు పారేయ్యద్దు..అవికూడా కూరలో వాడచ్చు .
  2. ఈ లోగా నూపప్పుని,ఎండు మిర్చిని నూనిలేకుండా కమ్మటి సువాసన వచ్చేదాకా వేయించి కాస్త చల్లారాక కొద్దిగా ఉప్పు వేసి పొడి కొట్టుకోవాలి.
  3. ఇప్పుడు మూకుడు పెట్టి నూని వేసి వేడయ్యాక ఆవాలు.. జీలకర్ర,పప్పులు,పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు,కరివేపాకు,పసుపు ,ఇంగువ వేసి వేగాక బ్రోకలి ముక్కలు వేసి మూత పెట్టాలి.
  4. 3..4 నిమిషాలు బాగా మగ్గిన తరువాత కొద్దిగా ఉప్పు, దంచిన నూపొడి ని వేసి బాగా కలపాలి.
  5. మరో 3..4 నిమిషాలకి కూర దగ్గర పడుతుంది...ఉప్పుసరి చూసుకుని వడ్డన పాత్ర లోకి తీసుకుంటే కమ్మటి బ్రోకలి నూపిండి కూర సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర