హోమ్ / వంటకాలు / వెజ్ తోఫు చిల్లీ

Photo of Veg Tofu Chilli by Swapna Tirumamidi at BetterButter
402
2
0.0(0)
0

వెజ్ తోఫు చిల్లీ

Feb-28-2019
Swapna Tirumamidi
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ తోఫు చిల్లీ రెసిపీ గురించి

తొఫు అనే పదార్ధాన్ని సోయా పాలతో తయారుచేస్తారు. అచ్చంగా పనీర్ లా ఉంటుంది. పాల ఉత్పత్తులు పడనివారికి ఈ తొఫు ఒక వరం లాంటిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చైనీస్
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. తోఫు 250 గ్రాములు
  2. కార్న్ ఫ్లోర్ 3 పెద్ద చెంచాలు
  3. అల్లం తరుగు ఒక చెంచా
  4. వెల్లుల్లి తరుగు ఒక చెంచా.
  5. నూని 5 చెంచాలు
  6. ఉప్పు సరిపడా
  7. మిరియం పొడి అర చెంచా
  8. ఎండుమిర్చి దంచినది ఒక చెంచా
  9. టమాటా సాస్ 2 పెద్ద చెంచాలు
  10. ఉల్లి కాడలు తరుగు పావు కప్పు
  11. ఉల్లి పాయముక్కలు అరకప్పు
  12. కాలిఫ్లవర్ ముక్కలు అరకప్పు
  13. క్యాప్సికమ్ ముక్కలు(3రంగులవి)ఒక కప్పు
  14. చిల్లీ సాస్ 1 పెద్ద చెంచా
  15. సొయా సాస్ 2 పెద్ద చెంచాలు
  16. వెనిగర్ 1 చెంచా
  17. తేనె 2 చెంచాలు.

సూచనలు

  1. తోఫు ని చతురసరంగా ముక్కలు చేసుకోవాలి.
  2. ఒక గిన్నిలోకి కార్న్ ఫ్లోర్,ఉప్పు,మిరియంపొడి వేసికలిపి ,ఈ పిండిని తొఫు ముక్కలకి జాగర్తగా పట్టించాలి.
  3. ఒక మూకుడులో 3 చెంచాల నూని వేసి తొఫు ముక్కల్ని అన్నిపక్కల దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి.
  4. అదే మూకుడులో మళ్ళీ కొద్దిగా నూనెవేసి,అల్లం వెల్లుల్లి,ఉల్లికాడలు,ఉల్లి ముక్కలు వేసి ఒకసారి వేయించి,కూర ముక్కలు అన్ని ఒకదానితరువత ఒకటి వేసి వేయించాలి.
  5. 2 నిమిషాలు వేయించాక ,టమాటా సాస్,చిల్లీ సాస్,సోయా సాస్,వెనిగర్,తేనె,ఉప్పు,మిరియం పొడి,దంచిన ఎండుమిర్చి పలుకులు ఒకదానితరువత ఒకటి వేసి అర నిమిషం వేయించాలి.
  6. ఒక చెంచా కార్న్ ఫ్లోర్ ని పావుకప్పు నీటిలో కలిపి ఇందులోవేసి బాగా కలపాలి.
  7. ఇప్పుడు దోరగా వేయించి పెట్టుకున్న తోఫు ముక్కలు వేసి సాస్లు అన్నీ ముక్కలకి పట్టేలా కలిపాలి
  8. అన్నీ బాగా కలిసాక మళ్ళీ కొన్ని ఉల్లికాడ ముక్కలు చల్లి పళ్ళెంలోకి తీసుకోవాలి.అంతే ఎంతో రుచిగా వుండే వెజ్ తొఫు చిల్లీ సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర