హోమ్ / వంటకాలు / మలై కోఫా

Photo of malai kofta by Himabindu at BetterButter
203
1
0.0(0)
0

మలై కోఫా

Feb-28-2019
Himabindu
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మలై కోఫా రెసిపీ గురించి

మలైకోఫ్తా కర్రీ పాపులర్ నార్త్ ఇండియన్ డిష్..ఇది చాల టేస్టీగ క్రీమీగ బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పంజాబీ
 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

 1. మలై కోఫ్తా కి కావలసినవి
 2. 1 కప్ - పనీర్
 3. 2 - బంగాళదుంప(ఉడకబెట్టినవి)
 4. 1 కప్ - పచ్ఛి భఠాని
 5. 1/2 కప్- జీడిపప్పు(పొడి)
 6. 1 - చెంచా కారం
 7. 2 - చెంచా మొక్క జొన్న పిండి
 8. 1 చెంచా - జిలకర్ర పొడి
 9. 1 చెంచా - ధనియాల పొడి
 10. 1 చెంచా - అల్లం,వెల్లుల్లి గుజ్జు
 11. 3 కొమ్మలు కొతిమీర
 12. ఉప్పు రుచికి సరిపడ
 13. నూనె వేయుంచటానికి సరిపడినంత
 14. కోఫ్తా కూర కి కావలసినవి
 15. 2 చెంచా - నూనె
 16. 1 చెంచా జీలకర్ర
 17. 1 చెంచా - అల్లం,వెల్లుల్లి గుజ్జు
 18. 4 - లవంగాలు
 19. 2 - యాలకులు
 20. 2 - దాల్చిన చెక్క
 21. 1 - పెద్ద ఉల్లిపాయ
 22. 2 - టొమాటో
 23. 1/2 కప్ - జీడిపప్పు
 24. 3 కొమ్మలు కొతిమీర
 25. 1 - చెంచా పసుపు
 26. 1 - చెంచా కారం
 27. చిటికెడ పంచదార
 28. 1/2 కప్- ఫ్రష్‌ క్రీమ్‌
 29. ఉప్పు రుచికి సరిపడినంత

సూచనలు

 1. మలై కోఫ్తా తయారుచేయు విధానం
 2. 1. ఒక పెద్ద గిన్నె లొ పనీర్,జీడిపప్పు,పచ్ఛిభఠాని,అల్లం,వెల్లుల్లి గుజ్జు,బంగాళదుంప ఉడికించినవి,జీలకర్ర పొడి,ధనియాల పొడి,కొతిమీర,ఉప్పు, అన్ని కలిపి బాల్స్ చేసుకోవాలి.
 3. 2.ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయ లొ నూనె పోసి పెట్టుకోవాలి.
 4. నూనె వేడయ్యాక చేసిపెట్టుకున్న బాల్స్ ని కార్న్ ప్లోర్లొ రోల్ చేసి నూనెలొ ఫ్రై చేసుకోవాలి.
 5. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయ పెట్టి 2 చెంచా నూనె వెసి నూనె వేడయ్యాక జీలకర్ర,లవంగాలు,దాల్చిన చెక్క వేసి వేయంచుకోవాలి అవి వేగాక ఉల్లిపాయ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి వేగాక టమొట వేసి అన్ని ఫ్రై చేసుకోవాలి.
 6. ఈ మిశ్రమం చల్లబడ్డాక గ్రైండ్ చేసికోని పెట్టుకోవాలి.ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ చేసిపెట్టుకోవాలి.
 7. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయ పెట్టి 2 చెంచా నూనె వేసి వేడయ్యాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కడాయ లొ వేసి కలయ పెట్టాలి.ఇప్పుడు 2 యాలుకలు,చిటికెడు పంచధార,1చెంచా పసుపు,కారం,ఉప్పు రుచికిసరిపడ,జీడిపప్పు పేస్ట్ వేసి కలయపెట్టాలి.
 8. ఇప్పుడు మిశ్రమం బాగ ఉడికాక రెడీ చేసిపెట్టుకున్న బాల్స్ ని గ్రేవీ లొ వేసుకోవాలి.ఇప్పుడు 5 నిమిషాలు ఉడకనివ్వాలి తరువాత తరిగిన కొతిమీర,ఫ్రష్ క్రీం వేసి గార్నిష్ చేసుకోవాలి.
 9. అంతే ఎంతో రుచికరమైన మలై కోఫ్తా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర