హోమ్ / వంటకాలు / మక్కజొన్న వడలు /గారెలు

Photo of Corn vada (maize) by kalyani shastrula at BetterButter
575
4
0.0(0)
0

మక్కజొన్న వడలు /గారెలు

Mar-05-2019
kalyani shastrula
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2 కప్స్ ఒలిచిపెట్టుకున్న మక్కజొన్న విత్తులు
  2. నాలుగు పచ్చిమిర్చి
  3. ఒక ఇంచ్ అల్లం ముక్క
  4. పసుపు చిటికెడు
  5. ఇంగువ చిటికెడు
  6. ఉప్పు తగినంత
  7. కొత్తిమీర కట్ట
  8. కరివేపాకు రెమ్మ
  9. జిలకర 1tbsn.
  10. సోయి కూర (ఆప్షన్ మాత్రమే)లేదా సోంపు ఒక స్పూన్
  11. నూనె డీప్ fry కి సరిపడా
  12. బెల్లం నిమ్మకాయంత

సూచనలు

  1. ముందుగా మొక్కజొన్న కంకుల నుండి గింజలను ఒలిచి పెట్టుకోవాలి .లేదా ఇలాగే గింజలు దొరుకుతాయి .వీటిని కడిగి నీరు ఒడగట్టుకోవాలి. మూకుడులో నూనె వేసి కాగనివ్వాలి .ఈ లోపు
  2. అల్లం పొట్టు తీసి ముక్కలు చేసుకోవాలి .పచ్చిమిర్చి ,సోంపు (సోయికూర ) ,జిలకర ,కొత్తిమీర,పసుపు ,ఇంగువ ,కరివేపాకు అన్నీ సిద్ధం చేసి మీక్సీ జార్ లో వేసుకొని మీక్సీ చేసుకోవాలి .
  3. ఇప్పుడు కొన్ని మక్కజొన్న గింజలు కూడా వేసి రుబ్బుకోవాలి .దీనిలో తగినంత ఉప్పు కలిపి పెట్టుకోవాలి .
  4. మిగిలిన మొక్కజొన్న గింజలలో కొద్దిగా బెల్లం వేసి రుబ్బుకోవాలి .తగినంత ఉప్పు వేసి నూనెలో గోలిస్తే తీపి మక్కజొన్న గారెలు సిద్ధం .
  5. పచ్చిమిర్చి ముద్ద కలిపిన పిండిని ఒక కవర్ మీద నూనె రాసి ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేయాలి
  6. రెండువైపులా బాగా కాల్చుకోవాలి
  7. తయారయిన కారం మక్కజొన్న వడలు
  8. తీపి మొక్కజొన్న గారెలు /వడలు
  9. రెండు రకాలు చేసుకోవచ్చు . తినేవాళ్లు వెల్లుల్లి వేసుకోవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర