ఆలు పోహ | POTATO flattened rice Recipe in Telugu

ద్వారా Rashmi SudhiMurthy  |  9th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of POTATO flattened rice by Rashmi SudhiMurthy at BetterButter
ఆలు పోహby Rashmi SudhiMurthy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

8

0

ఆలు పోహ వంటకం

ఆలు పోహ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make POTATO flattened rice Recipe in Telugu )

  • అటుకులు 2 కప్పులు
  • ఉడికించిన ఆలు ముక్కలు 1/4 కప్
  • ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్
  • టొమాటో 1
  • పచ్చికొబ్బరి తురుము 1/4 కప్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  • పచ్చిమిర్చి 4
  • ధనియాల పుడి 1/2 టీ స్పూన్
  • గరం మసాలా 1/2 టీ స్పూన్
  • పసుపు 1/4 టీ స్పూన్
  • కరివేపాకు 2 రెమ్మలు
  • కొత్తిమీర తరుగు 1/4 కప్
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె 4 టేబుల్ స్పూన్లు
  • నీళ్ళు అటుకులు నాన డానికి సరిపడా
  • పోపు దినుసులు 1 టీ స్పూన్ ( ఆవాలు,జీలకర్ర, మినపప్పు)
  • నిమ్మరసం 1 టీ స్పూన్

ఆలు పోహ | How to make POTATO flattened rice Recipe in Telugu

  1. ముందుగా మీడియం అటుకులు బాగా కడిగి శుభ్రం చేసుకుని నీళ్ళు వంపి రెడీగా పెట్టుకోవాలి.ఆలు ముక్కలు మైక్రోవేవ్/ స్టవ్ లో ఉడికించి పెట్టుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, పసుపు ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి,ఉప్పు వేసి ఫ్రై చేయాలి
  3. అవి వేగాక అందులో టొమాటో ముక్కలు,ఉడికించిన ఆలు ముక్కలు వేసి వేగనివ్వాలి.
  4. అదంతా వేగాక పచ్చికొబ్బరి తురుము, ధనియాల పుడి, గరంమసాలా వేసి కలిపి కొత్తిమీర తరుగు, అటుకులు వేసి బాగా కలపాలి
  5. చివరిగా నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

నా చిట్కా:

మీడియం లేదా గట్టిగా ఉండే అటుకులతో బాగుంటుంది

Reviews for POTATO flattened rice Recipe in Telugu (0)