హోమ్ / వంటకాలు / ఆలు పోహ

Photo of POTATO flattened rice by Rashmi SudhiMurthy at BetterButter
481
4
0.0(0)
0

ఆలు పోహ

Mar-09-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు పోహ రెసిపీ గురించి

అటుకులతో చేసే ఈ టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా శ్రమ లేకుండా సులభంగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. అటుకులు 2 కప్పులు
  2. ఉడికించిన ఆలు ముక్కలు 1/4 కప్
  3. ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్
  4. టొమాటో 1
  5. పచ్చికొబ్బరి తురుము 1/4 కప్
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్
  7. పచ్చిమిర్చి 4
  8. ధనియాల పుడి 1/2 టీ స్పూన్
  9. గరం మసాలా 1/2 టీ స్పూన్
  10. పసుపు 1/4 టీ స్పూన్
  11. కరివేపాకు 2 రెమ్మలు
  12. కొత్తిమీర తరుగు 1/4 కప్
  13. ఉప్పు రుచికి సరిపడా
  14. నూనె 4 టేబుల్ స్పూన్లు
  15. నీళ్ళు అటుకులు నాన డానికి సరిపడా
  16. పోపు దినుసులు 1 టీ స్పూన్ ( ఆవాలు,జీలకర్ర, మినపప్పు)
  17. నిమ్మరసం 1 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా మీడియం అటుకులు బాగా కడిగి శుభ్రం చేసుకుని నీళ్ళు వంపి రెడీగా పెట్టుకోవాలి.ఆలు ముక్కలు మైక్రోవేవ్/ స్టవ్ లో ఉడికించి పెట్టుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేడి చేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, పసుపు ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి,ఉప్పు వేసి ఫ్రై చేయాలి
  3. అవి వేగాక అందులో టొమాటో ముక్కలు,ఉడికించిన ఆలు ముక్కలు వేసి వేగనివ్వాలి.
  4. అదంతా వేగాక పచ్చికొబ్బరి తురుము, ధనియాల పుడి, గరంమసాలా వేసి కలిపి కొత్తిమీర తరుగు, అటుకులు వేసి బాగా కలపాలి
  5. చివరిగా నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర