హోమ్ / వంటకాలు / అటుకుల కట్లెట్

Photo of Flattened rice cutlet by Rashmi SudhiMurthy at BetterButter
635
3
0.0(0)
0

అటుకుల కట్లెట్

Mar-09-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల కట్లెట్ రెసిపీ గురించి

ఎప్పుడూ ఓకేరకం కట్లెట్ల కన్నా కొంచెం వెరైటీగా అటుకులతో చేసుకుంటే చాలా క్రిస్పీ గా మరియు రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు 1 కప్
  2. ఉడికించిన బంగాళదుంప 1
  3. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు
  4. కొత్తిమీర తరుగు 1/4 కప్
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్
  6. గరంమసాలా 1/4 టీ స్పూన్
  7. తరిగిన పచ్చిమిర్చి 2
  8. కారం పుడి 1/4 టీ స్పూన్
  9. పసుపు 1/4 టీ స్పూన్
  10. ధనియాల పుడి 1/4 టీ స్పూన్
  11. ఉప్పు రుచికి సరిపడా
  12. బ్రెడ్ క్రమ్స్ 1/2 కప్
  13. కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు
  14. నీళ్లు సరిపడా
  15. నూనె డీప్ఫ్రై లేదా షాల్లో ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా అటుకుల ను బాగా కడిగి నీళ్ళు మొత్తం వంపి చేత్తో మెదిపి పెట్టాలి
  2. అందులో ఉడికించిన ఆలుని మెదిపి వేసి ఉప్పు,కారం,పసుపు,గరం మసాలా, అల్లంవెల్లుల్లి ధనియలపుడి,తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయలు అన్ని వేసి కలపాలి
  3. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూనుల బ్రెడ్ క్రమ్స్ వేసి మనకి నచ్చిన ఆకారంలో కట్లెట్స్ చేసుకోవాలి
  4. ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్ వేసి నీళ్ళు వేసి జారుడుగా కలిపి స్లర్రి చేసుకోవాలి
  5. ఇప్పుడు కట్లెట్స్ కార్న్ ఫ్లోర్ మిశ్రమం లో ముంచి బ్రెడ్ క్రమ్స్ లో దొర్లించి నూనె లో వేసి డీప్ ఫ్రై కానీ షాల్లో ఫ్రై కానీ చేసుకోవాలి
  6. వేడి వేడి కట్లెట్స్ టొమాటో కెచప్ లేదా గ్రీన్ చట్నీ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర