పులిహోర పిండి | Pulihora pindi Recipe in Telugu

ద్వారా Kiran Gopisetti  |  9th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pulihora pindi recipe in Telugu,పులిహోర పిండి, Kiran Gopisetti
పులిహోర పిండిby Kiran Gopisetti
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

8

0

పులిహోర పిండి వంటకం

పులిహోర పిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pulihora pindi Recipe in Telugu )

  • బియ్యం రవ్వ 1గ్లాస్
  • నారింజకాయలు 3
  • పసుపు 1/4 స్పూన్
  • ఆయిల్ 100 గ్రామ్స్
  • ఉప్పు 2 స్పూన్స్
  • తాలింపు గింజలు 2 స్పూన్స్
  • కరివేపాకు
  • పచ్చిమిర్చి 4
  • ఎండుమిర్చి 2
  • చెనక్కాయ పప్పు 50 గ్రామ్స్
  • జీడిపప్పు మన ఇష్టం
  • ఇంగువ 1/2 స్పూన్

పులిహోర పిండి | How to make Pulihora pindi Recipe in Telugu

  1. పాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత పసుపు వేసి 2 గ్లాస్ ల నీళ్ళు పొయ్యాలి
  2. నీళ్ళు మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ రవ్వ పోసి మూత పెట్టి సిమ్ లో పెట్టి మగ్గించాలి
  3. 5 నిమిషాలు తరువాత ఒక ప్లేట్ లో ఆరపెట్టాలి.
  4. దానిలో నారింజకాయ రసం, ఉప్పు పట్టించి
  5. మళ్ళీ పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తయువత చెనక్కాయ పప్పు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు ఒకదాని తరువాత ఒకటి వేసి వేగిన తరువాత ఇంగువ వేయాలి
  6. ఈ తాలింపు పిండిలో పోసి కలపాలి.

నా చిట్కా:

పచ్చి మామిడి, నిమ్మ, చింతపండు రసం ఏదైనా ఇదే ప్రోసెస్. దీన్ని రవ్వ పులిహోర అనికూడా అంటారు.

Reviews for Pulihora pindi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo