ఖాండ్వి | khandavi Recipe in Telugu

ద్వారా Himabindu   |  10th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of khandavi by Himabindu  at BetterButter
ఖాండ్వి by Himabindu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

ఖాండ్వి వంటకం

ఖాండ్వి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make khandavi Recipe in Telugu )

  • 1కప్- శనగపిండి
  • 2కప్స్- మజ్జిగ
  • 1(tbsp)చెంచా-అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్ట్
  • 1(tsp)చెంచా-పసుపు
  • 1(tbsp)చెంచా-ఆవాలు
  • 1(tbsp)చెంచా-నువ్వులు
  • 1(tbsp)చెంచా-కొతిమీర
  • 2(tbsp)చెంచా-కొబ్బరి తురుము
  • కరివేపాకు పది రెమ్మలు
  • ఉప్పు రుచికి సరిపడ
  • 1 1/2 (tbsp)చెంచా- నూనె

ఖాండ్వి | How to make khandavi Recipe in Telugu

  1. ఒక స్టీల్ బౌల్ లొ శనగపిండి,మజ్జిగ,అల్లం వెల్లుల్లి,పచ్చిమిర్చి పేస్ట్ ,ఉప్పు వేసి ఉండలు లేకుండ బాగ కలుపుకోవాలి.
  2. ఇప్పుడు కుక్కర్ లొ 2 కప్స్ నీరు పోసుకొని పెట్టుకోవాలి.ఇప్పుడు పిండి కలిపిన మిశ్రమం బౌల్ ని కుక్కర్ లొ పెట్టి మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద 5 విసిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  3. ఆ మిశ్రమం ఉడికే లోపు తాలింపు వేసి పెట్టుకోవాలి.
  4. తాలింపుకి స్టవ్ వెలిగించి కడాయ పెట్టి నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు,నువ్వులు,కరివేపాకు వేసి వేయంచుకోవాలి.
  5. ఇప్పుడు ఉడికిన పిండిని 2చెంచా చొప్పున స్టీల్ ప్లేటు లోకి తీసుకొని ఫోటోలొ చూపిన విధంగ చదును చేసుకోవాలి
  6. ఒక 5 నిమిషాలలొ ఆరిపోతుంది.ఆరాక తాలింపుని,కొతిమీర,కొబ్బరితురుముని చల్లుకొని చాకుతొ స్ర్టైట్ గ కట్ చేసుకోని రౌండ్ గ చుట్టుకోవాలి.
  7. ఇప్పుడు చుట్టుకున్న రోల్స్ ని ఒక దానిమీద ఒకటి అమర్చుకోవాలి.
  8. ఇప్పుడు అమర్చుకున్న రోల్స్ మీద తాలింపు,మిరియాల పొడి,కొబ్బరి తురుము వేసి గార్నిష్ చేసుకోవాలి.

Reviews for khandavi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo

ఇలాంటి వంటకాలు