హోమ్ / వంటకాలు / చట్నీ పొడి

Photo of CHUTNEY POWDER by Rashmi SudhiMurthy at BetterButter
733
3
0.0(0)
0

చట్నీ పొడి

Mar-11-2019
Rashmi SudhiMurthy
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చట్నీ పొడి రెసిపీ గురించి

ఈ చట్నీపొడి అన్నంలో కి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే చపాతికి కూడా మంచి కాంబినేషన్. కొన్ని రకాల కూరల్లో కూడా కారం పొడి కి బదులుగా వేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. ఎండు మిరపకాయలు బ్యాడిగి 20
  2. ఎండు కొబ్బరి 1 చిప్ప
  3. వెల్లుల్లి రెబ్బలు 10( తొక్క తో పాటు)
  4. ధనియాలు 1/4 టీ స్పూన్
  5. మెంతులు చిటికెడు
  6. జీలకర్ర 1/4 టీ స్పూన్
  7. శెనగపప్పు 1 టేబుల్ స్పూన్
  8. కరివేపాకు 20
  9. చింతపండు చిన్న నిమ్మకాయ అంత
  10. బెల్లం తురుము 1 టీ స్పూన్
  11. ఉప్పు రుచికి సరిపడా
  12. నూనె 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ఒక పాన్ లో నూనె వేడిచేసి ఎండు మిరపకాయలు వేయించి పక్కన పెట్టాలి
  2. ఎండు కొబ్బరి ని ముక్కలు గా చేసుకుని అదే పాన్ లో వేసి కొంచెం వేయించాలి (రంగు మరకూడదు)
  3. వెల్లుల్లి ని కొంచెం గాట్లు పెట్టి ఒక సారి వేడి పాన్ మీద వేసి రంగుమరకుండా వేయించి పెట్టుకోవాలి
  4. ఇప్పుడు శెనగపప్పు,ధనియాలు, మెంతులు,జీలకర్ర,కరివేపాకు,చింతపండు అన్ని దోరగా వేయించాలి(నూనె మళ్ళీ వేయనవసరం లేదు)
  5. మిక్సీలో వేయించిన మిరపకాయలు ఉప్పు వేసి ఒక సారి రుబ్బుకొని,కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసి మళ్ళీ మిగిలిన వన్నీ వేసి బరకగా రుబ్బుకోవాలి
  6. అంతే ఎంతో రుచికరమైన చట్నీ పొడి రెడీ. కొంచెం చల్లబడ్డ తరువాత బాక్స్ లో వేసి స్టోర్ చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర