హోమ్ / వంటకాలు / అటుకుల చుడువా

Photo of Rice flakes chivda  by kalyani shastrula at BetterButter
1264
2
0.0(0)
0

అటుకుల చుడువా

Mar-11-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల చుడువా రెసిపీ గురించి

పేపర్ అటుకులతో చేసే స్నాక్స్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. 3కప్స్ కరకరలాడుతున్న పేపర్ అటుకులు
  2. 1కప్ నూనెలో గోలించిన పేలాల సాబుదానా
  3. 1కప్ నూనెలో గోలించిన మక్క అటుకులు
  4. అప్పడాలు 4
  5. బొంగులు 6.లేదా ఏవైనా వడియాలు
  6. పల్లీలు పావుకప్పు
  7. డీప్ fry కిసరిపడా నూనె
  8. ఇంగువ 1స్పూన్
  9. పసుపు 1స్పూన్
  10. ఎండుమిర్చి 4జిలకర స్పూన్
  11. ఉంటే కరివేపాకు ఒక రెమ్మ
  12. తగినంత ఉప్పు

సూచనలు

  1. ముందుగా పేపర్ అటుకులు ఒకరోజు మంచి ఎండలో పెట్టి ఉంచుకోవాలి .నోట్లో వేసుకుంటే కరకరలాడాలి .లేదా (రెండు నిముషాలు మూకుడులో వేయించి తీసుకోవాలి )
  2. పేలాల సాబుదానా వీటిని బాగా కాగుతున్న నూనెలో వేయాలి
  3. ఇలా ఉబ్బి పేలాల మాదిరిగా అవుతాయి
  4. మక్క అటుకులు కూడా నూనెలో గోలించి తీసుకోవాలి
  5. ఇంట్లి ఏవి ఉంటే అవి గోలించి పెట్టుకోవాలి .నేను అప్పడాలు ,బొరుగులు గొలించాను
  6. వీటిని అన్నింటిని అటుకులలో వేసి ఉప్పు వేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి
  7. గోలించుకోగా మిగిలిన నూనెలో ఆవాలు ,జిలకర , ఎండుమిర్చి ,పల్లీలు ,ఇంగువ ,పసుపు ,కరివేపాకు అన్నీ వేసి పోపు చేసి పెట్టుకోవాలి .(ఎండుకొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు )
  8. ఈ పోపును అటుకులలో వేసి మొత్తం బాగా కలిసేటట్టుగా కలిపి ,చల్లారాక డబ్బాలోకి తీసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర